Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
క్విటో: ఒక చర్చికి చెందిన ఫాదర్, మరణం గురించి ప్రసంగించారు. అయితే వెనుక గోడకు ఉన్న పెద్ద సిలువ ఊడి ఆయన తలపై పడింది. కుప్పకూలిన ఆ ఫాదర్ అక్కడికక్కడే మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (cross falls on Priest) ఈక్వెడార్ దేశంలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 17న గ్వాయాక్విల్‌లోని ‘చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్’లో పారిష్ మతగురువుగా పనిచేసిన ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మొలినారి అక్కడ ప్రసంగించారు. జీవితం అశాశ్వతమన్న అంశం గురించి ఆయన మాట్లాడారు. భక్తులు తమ జీవితాలను ఫోన్లలో గడుపుతూ వృథా చేసుకోవద్దని సూచించారు. దేవుని కోసం, తమ ప్రియమైన వారి కోసం…
కాగా, ఆ ప్రసంగం తర్వాత చర్చిలో ఉన్న వారిని దీవించమని దేవుడిని వేడుకుంటూ ఫాదర్ మొలినారి ప్రార్థన ప్రారంభించారు. ఇంతలో ఉన్నట్టుండి వెనుక గోడకు ఉన్న భారీ సిలువ ఊడింది. నేరుగా ఆయన తలపై అది పడింది. దీంతో కుప్పకూలిన ఆ ఫాదర్ అక్కడికక్కడే చనిపోయారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ ఫాదర్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చర్చి అధికారులు కూడా ఫాదర్ మొలినారి మరణాన్ని ధృవీకరించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/priest-in-ecuador-speaks-about-death-in-sermon-dies-moments-later-as-cross-falls-on-him-video-goes-viral-2540288
framing not published · 1 outlet covered this story, below the floor for a split