Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Without Breathing | హాలీవుడ్ చిత్రం స్ట్రీట్ ఫైటర్ లో ధాల్సిమ్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏకంగా 15 నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారు. ధ్యాన భంగిమలో కూర్చుని యోగ సాధన ద్వారా శ్వాసను నియంత్రించే తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పతంజలి యోగసూత్రాల్లోని ఓ పద్ధతిని ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఈ సాధన తన జీవితంలో ఎన్నో లక్ష్యాలను సాధించేందుకు సహాయపడిందని, యువతకు కూడా దీన్ని నేర్పిస్తున్నానని పేర్కొన్నారు. జీవితంలో లక్ష్యాల కోసం నిరంతరం పరుగులు పెట్టకుండా, అప్పుడప్పుడు ఆగి ప్రశాంతంగా ఉండడం కూడా ముఖ్యమని…
సాధారణంగా మనం శ్వాస తీసుకున్నప్పుడు శరీరానికి ఆక్సిజన్ అందుతుంది. అదే సమయంలో కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లిపోతుంది. శ్వాసను ఆపినప్పుడు కూడా శరీరంలోని కణజాలాలు ఆక్సిజన్‌ను వినియోగిస్తూనే ఉంటాయి. దీంతో రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఈ మార్పు వల్ల మళ్లీ శ్వాస తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. అయితే, ఎక్కువసేపు శ్వాసను బిగపట్టినప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోతాయి. ఈ పరిస్థితిని హైపోక్సియా అంటారు. దీని వల్ల మెదడు, ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందక తల తిరగడం, అయోమయం, సమన్వయం కోల్పోవడం, చివరకు స్పృహ తప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శ్వాసను ఎక్కువసేపు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/health/is-it-possible-to-go-without-breathing-for-a-long-time-can-this-be-practiced-2536648
framing not published · 1 outlet covered this story, below the floor for a split