woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
లక్నో: సుమారు 30 ఏళ్ల వయస్సున్న మహిళ, 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. వయస్సులో 45 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ వృద్ధుడికితో వివాహానికి తనకు ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆ మహిళ స్పష్టం చేసింది. (woman falls in love with old man) ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల రీనా, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా పాపురల్ అయ్యింది. ఏడాది కిందట 75 ఏళ్ల రామ్ సాగర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల…
కాగా, 75 ఏళ్ల వృద్ధుడైన రామ్ సాగర్ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు రీనా ధృవీకరించింది. తమ ఇద్దరి మధ్య 45 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ అది ఏమాత్రం సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. తన నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తమ మధ్య ఉన్న వయస్సు అంతరం తమ బంధానికి ఎటువంటి అడ్డంకి కాదని ఆమె పేర్కొంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/uttar-pradesh-woman-30-falls-in-love-with-75-year-old-man-wedding-planned-after-navratri-2539424
framing not published · 1 outlet covered this story, below the floor for a split