యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఐదో యూనిట్ ట్రయల్ రన్ సక్సెస్
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
నల్లగొండ: దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఐదో యూనిట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇప్పటికే ప్లాంట్లో నాలుగు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. జెన్కో అధికారులు తాజాగా ఐదో యూనిట్ ట్రయల్ రన్ పూర్తి చేశారు. వచ్చే నెల నాటికి ఐదు యూనిట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు చేపట్టారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపల్లిలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లతో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యమున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.37 వేల కోట్లను దాటింది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) పలు పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/yadadri-thermal-power-plant-reaches-another-milestone-with-the-successful-synchronization-of-unit-5-with-the-grid
framing not published · 1 outlet covered this story, below the floor for a split