యూనియన్ నేత ఆగడాలు!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఓ యూనియన్ నేత ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)కి కమిషనర్ లేకపోవడంతో షాడో కమిషనర్గా సదరు యూనియన్ నేత చలామణి అవుతున్నట్టు తెలుస్తున్నది. సీనియారిటీ లేకపోయినా వైద్యశాఖలో అత్యంత కీలక పోస్టులో ఉన్న ఓ ముఖ్య అధికారి సదరు యూనియన్ నేత వెనుక ఉండి ఈ తంతును నడిపిస్తున్నట్టు సమాచారం.
టీవీవీపీలో ఏ ఫైల్ కదలాలన్న సదరు యూనియన్ నేతను కలవాల్సిందే..! అని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా యూనియన్ నేత ఏకంగా టీవీవీపీ కమిషనర్ పాల్గొనాల్సిన హెచ్వోడీల మీటింగ్లకు హాజరవుతున్నట్టు సమాచారం. తాజాగా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎంఎస్ఐడీసీ)లో బీఎఫ్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో సదరు యూనియన్ నేత పాల్గొని హడావుడి చేసినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా వైద్య శాఖలో కొంత మంది అధికారులకు ఫోన్లు చేసి తాను చెప్పిన పనులు చేసి పెట్టాల్సిందే అని హుకూం జారీ చేసినట్టు సమాచారం.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/alleged-union-leaders-influence-raises-questions-in-telangana-health-department-2540638
framing not published · 1 outlet covered this story, below the floor for a split