విశాలాంధ్ర – రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ జలమండలి కార్యాలయంలో ఏటీఓ సీబీ డబ్ల్యుఎస్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అక్తర్ అలీ జలమండలి కార్యాలయంలో చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పీడీపీ చౌరస్తా లో ఉన్న అర్మాన్ హోటల్ కు అనుమతులు లేకుండ నల్లా కనెక్షన్ తీసుకున్నారని, దాన్ని పరిశీలించిన సయ్యద్ అక్తర్ అలీ చర్యలు తీసుకోకుండ రూ. 3లక్షలు లంచంగా తీసుకున్నారని జలమండలి ప్రధాన కార్యాలయం కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందింది. అక్రమ నల్లా కనెక్షన్ కు సంబందించి ఫోటోలు కూడా పంపించారు. స్పందించిన జలమండలి ఉన్నతాధికారులు గత శనివారం విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించినట్లు…