Bathukamma | బతుకమ్మ పండుగ అంటేనే రంగురంగుల పూలు.. ఆటపాటలు.. ఆడపడుచుల సందడి! తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగ వేళ వెలుగులు విరజిమ్మాల్సిన చోట చీకట్లు అలుముకున్నాయి. ఆటపాటలతో సందడిగా సాగాల్సిన బతుకమ్మ వేడుకలకు కరెంట్ కోతలతో చీకట్లు అలుముకున్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో బతుకమ్మ ఆడే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లతోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది.
ఈ ఘటనపై జయ్యారం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ సమయంలో కూడా కరెంటు కోతలు విధించడమేంటని మండిపడుతున్నారు. పండుగ వేళల్లోనైనా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.