హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ దెబ్బతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) దిగొచ్చింది. తెలంగాణ ప్రాజెక్టులకు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలన్న ఏపీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఆ అంశాలను ఎజెండాలో చేర్చేందుకు నిరాకరించింది. వాటి ప్రస్తావన లేకుండానే 30న బోర్డు 18వ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ ఇరు రాష్ర్టాలకు సమాచారం అందించారు. వాస్తవానికి ఆగస్టులోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన జీఆర్ఎంబీ.. ఎజెండా అంశాలను పంపాలని ఇరు రాష్ర్టాలకు సూచించింది. దీంతో నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదనలు పంపిన ఏపీ.. గోదావరిలో…
ఏపీ ప్రతిపాదించిన అంశాలను వెంటనే ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగింది. అనంతరం కండ్లు తెరచిన రేవంత్రెడ్డి సర్కార్.. ఏపీ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖ రాసింది. ఆ అంశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఎజెండాపై వివాదంపై చెలరేగడంతో 18వ సమావేశాన్ని వాయిదా వేసిన బోర్డు.. అదే సమావేశాన్ని ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు మరోసారి ఎజెండాను పంపిన జీఆర్ఎంబీ.. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులపై చేసిన ఏపీ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ…