గద్వాల/ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 19 : తనను తాను ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడిగా చెప్పుకొనే ఓ యూట్యూబర్ బీఆర్ఎస్ నేతలు, వారి బంధువుల ఇండ్లను టార్గెట్ చేశాడు. వారి పొలాలు, ఫాంహౌస్ల్లోకి అక్రమంగా ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు నిత్యం వీడియోలు సృష్టించే సదరు యూట్యూబర్.. చివరికి జనమే దేహశుద్ధి చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బంధువుల ఫాంహౌస్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన కొడంగల్ నర్సింహను పట్టుకున్న స్థానికులు.. వీపు సాపు చేసి, ఆయనను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో నిందితుడికి బుద్ధి చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు..…
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లికి చెందిన య్యూటూబర్ నర్సింహ.. బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత వివరాలతోపాటు, వారి వ్యవసాయ క్షేత్రాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి వీడియోలు తీసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చాలారోజులుగా ఆరోపిస్తున్నాయి. సోమవారం నర్సింహ మానవపాడు మండలం చండూరు దగ్గర ఉన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బంధువుల వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించి అక్కడ వారు సాగు చేస్తున్న పామాయిల్ తోటతోపాటు అక్కడ ఉన్న ప్రదేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సిబ్బంది కంటపడ్డాడు. స్థానికుల సాయంతో వారు అతడిని పట్టుకునే క్రమంలో పారిపోయాడు. బీచుపల్లి…