రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు ఊరట లభించింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై విధించాల్సిన ఆంక్షలు, 100శాతం సుంకాలు ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షల అమలుకు ఇచ్చిన నెలరోజుల గడువు రేపటితో ముగియనున్న క్రమంలో రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు ఉపశమనం లభించినట్లయింది.
ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు అవసరం అని, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని బహిరంగంగా విమర్శించడం ద్వారా రష్యాకుసానుకూల ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.