Botsa Satyanarayana | బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు : మాజీ మంత్రి బొత్స
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) బీసీ ( BCs ) లకు మరోసారి వెన్నుపోటు ( Backstabbed ) పొడిచారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana ) ఆరోపించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళతానని చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. రిజర్వేషన్లు 50శాతం కంటే మించవద్దని కోర్టు గతంలో స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ బీసీలకు రిజర్వేషన్ల పెంపుదల జీవోను తీసుకొచ్చారని విమర్శించారు.
బీసీల పట్ల ప్రేమ ఉంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణకు కేంద్రంపై ఒత్తిడిలు తీసుకురావాలని సూచించారు. వెన్నుపోటు పార్టీలో ఉన్న బీసీ నాయకులు చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని కోరారు. బీసీల మనోభావాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అయితే బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుందని తప్పుడు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.