DGP CV Anand | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ వేస్తే కఠిన చర్యలు తప్పవు’ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పోలీసు యూనిఫామ్‌లోనే డ్యాన్సులు వేయడం.. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, ఇకపై అటువంటి చర్యలను ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో పోలీసులు యూనిఫామ్‌లోనే డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. జనాలతో కలిసి చిందులు తొక్కుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీస్‌బాస్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.