Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- Telangana DGP C.V. Anand issued oral orders warning police against dancing in uniform at private events. This follows viral videos of police officers dancing in uniform and subsequent public criticism regarding their discipline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
DGP CV Anand | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ వేస్తే తప్పవు’ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పోలీసు యూనిఫామ్‌లోనే డ్యాన్సులు వేయడం.. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, ఇకపై అటువంటి చర్యలను ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో పోలీసులు యూనిఫామ్‌లోనే డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. జనాలతో కలిసి చిందులు తొక్కుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీస్‌బాస్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.