గతంలోనే ఆగిపోయిన చార్మినార్ గడియారం.. మూడు రోజులుగా ముల్లు ముందుకు కదల్లే !
AI-estimated: this article's coverage tilts toward no party.
నాలుగు వందల ఏళ్ల చరిత్రతో ఇప్పటికీ విరాజిల్లుతున్న చార్మినార్‌ను నిర్వహణా లోపం వెంటాడుతుంది. చార్మినార్ గడియారం గతంలోనే ఆగిపోయింది. లాడ్ బజార్ వైపు ఉన్న చార్మినార్‌లోని గడియారాలలో ఒకటి గడచిన మూడు రోజులుగా అర్ధరాత్రి 12:30 గంటల వద్దే ఆగిపోయింది. మరొకటి మాత్రమే సరైన సమయాన్ని చూపిస్తోంది. స్థానికులు, పర్యాటకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
ఇంత ప్రముఖ చారిత్రక కట్టడం నిర్వహణ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చార్మినార్ను రోజూ కొన్ని వందల మంది సందర్శిస్తుంటారు. విదేశీయులు కూడా చార్మినార్ను చూసేందుకు వస్తుంటారు. హైదరాబాద్ పేరు వినగానే అందరికీ మొదట గుర్తొచ్చేది చార్మినార్. ఇలాంటి చార్మినార్ నిర్వహణను లైట్ తీస్కోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.