అహ్మదాబాద్ : ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్ర విద్యుత్తు సంక్షోభంతో రాష్ట్రం అల్లాడిపోతున్నది. కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, బొగ్గు కొరత, తగ్గిన పవన విద్యుదుత్పత్తి, జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి పరిణామాలు రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో వారానికి ఒకరోజు 8 గంటలపాటు విద్యుత్తు కోతలు విధించే చర్యలు చేపట్టింది. దీంతో పరిశ్రమల ఉత్పత్తి, దీపావళి ఆర్డర్ల సరఫరా, కార్మికుల ఉపాధిపై ఆందోళన…
గుజరాత్‌లోని గ్రామాలు, వ్యవసాయ ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. గ్రామాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా అందించే జ్యోతిగ్రామ్ పథకం అమలు ఉన్న ప్రాంతాల్లోనూ కోతలు విధిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. సాగునీటి కోసం విద్యుత్తుపై ఆధారపడే రైతులకు మోటార్లు పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు ఫేజ్‌ల సరఫరా ఉండే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు ఆదా కోసం సింగిల్ ఫేజ్ సరఫరాకు మారే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రానున్న వేసవిలో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.