కొడంగల్, అక్టోబర్ 16 : కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరందిస్తామని సీఎం రేవత్‌రెడ్డి చెప్పడం పచ్చి మోసమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదని చెప్పారు. ఈ పథకం డిజైన్‌ను రేవంత్‌రెడ్డి చేశారా.. లేక తిరుపతిరెడ్డి చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. బొంరాస్‌పేట పరిధిలో 12 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయని…
పొలాలపై నుంచి కాలువల నిర్మాణం చేపడితే రైతులకు సాగునీరందే అవకాశం ఉంటుందని.. కానీ పొలాల కింది నుంచి నిర్మించడంలో ఆంతర్యమేందో రేవంత్‌రెడ్డి వివరించాలని డిమాండ్‌చేశారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలు పూర్తిగా కమీషన్ల పథకంగా ఉందని ఆరోపించారు. ఇండ్లు కూల్చేందుకు, పొలాలు లాక్కునేందుకు రేవంత్‌రెడ్డిని సీఎం చేశామా అని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో చేపడుతున్న భూ సేకరణలో ఒక్కోప్రాంతానికి ఒక్కోవిధంగా నష్టపరిహారాన్ని అందించడంలో ఆంతర్యమేంద ని ప్రశ్నించారు. బొంరాస్‌పేటలో ఎకరా 70 లక్షల వరకు ధర ఉందని, ఆమేరకు పరిహారం అందించాలని డిమాండ్‌చేశారు.