ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు ఉండటాన్ని బట్టి అది తెలిసిపోతోంది.. హైదరాబాద్కు సంబంధించిన ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్య
ఈనాడు, దిల్లీ: ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలంలోని శంషిగూడ గ్రామంలోని సర్వే నం.57లో ఉన్న ఆషంజాహి పైగా ఆస్తుల పంపకానికి సంబంధించి అక్తర్ జహాన్ బేగం అనే మహిళ దాఖలు చేసిన కేసును జస్టిస్ బాలచంద్రవరాలేతో కలిసి విచారించిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందులో ప్రతివాదుల జాబితాలో తెలంగాణ ప్రభుత్వంతోపాటు మొత్తం 315 మంది వ్యక్తులు, సంస్థల…