పుంగనూరు, రాయచోటిలో టీడీపీ- వైఎస్సార్సీపీ పరస్పర దాడులు
నామినేషన్ల తొలిరోజే స్థానిక ఎన్నికలు వేడి రాజుకున్నాయి. నామినేషన్లు దాఖలు వేళ అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో వైఎస్సార్సీపీ , టీడీపీ వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. పుంగనూరులో చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా వారి మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలూ పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. రాళ్లదాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.