Parvesh Verma : ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేశ్ వర్మ (Parvesh Verma) దేశ రాజధాని ప్రజలకు వినూత్న అభ్యర్థన చేశారు. పుట్టినరోజు (Birthday) వంటి ప్రత్యేకమైన వేడుకలను యమునానది (Yamuna River) ఒడ్డున జరుపుకోవాలని కోరారు. నదిని శుభ్రంగా ఉంచే ప్రణాళికల్లో భాగంగా ఈ ఆలోచన చేశారు. వచ్చే నెల 7న తన పుట్టినరోజును కూడా యమునా నది ఒడ్డున చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
యమునా నది చెంతన పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఢిల్లీ ప్రజలను కోరుతున్నానని, నవంబర్ 7న తన పుట్టినరోజును కూడా అక్కడే చేసుకోబోతున్నానని పర్వేశ్ వర్మ చెప్పారు. కుటుంబాలు ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకునేందుకు నదీ తీరాల్లో కొన్ని ప్రత్యేక కుటీరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఘాట్లను శుభ్రం చేయడం వంటి స్వచ్ఛంద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కూడా అక్కడ ఉండొవచ్చని మంత్రి చెప్పారు.