మునిపల్లి, అక్టోబర్ 15 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి రోజు గంటకోసారి కరెంట్ కట్ కావడంతో సరైన కరెంట్ సరఫరా లేక స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలంలో గంటకోసారి కరెంట్ కట్ అవ్వడం ప్రతిరోజు ఉండడంతో మండల వాసులకు అవస్థలు తప్పడం లేదు. మండల కేంద్రమైన మునిపల్లితో పాటు మండలంలోని కంకోల్,తాటిపల్లి, పెద్దలోడి గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేష్న్లు ఉన్నాయి. మండలంలో కరెంట్ అధికారుల కోరత ఉండడంతో ఎన్నడలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప పరిష్కారం అవడం లేదనే విమర్శలు గట్టిగ వినిపిస్తున్నాయి.
మునిపల్లి మండల విద్యుత్ అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మండల వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలవక సతమతమవుతున్నారు. మండలంలో విద్యుత్ అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో కరెంటు సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మునిపల్లి మండల విద్యుత్ అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో కిందిస్థాయిలోని ఓ అధికారికి ఉన్నత అధికారుల పెత్తనం ఇవ్వడంతో ఆ అధికారి ఆడిందే…ఆట పాడిందే పాట అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు పలు రకాలు విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మండలంలో సరైన విద్యుత్ అధికారులు లేకపోవడంతో మునిపల్లి మండలంలో కరెంటు సరఫరా కరెక్ట్ లేదంటున్నారు…అధికారులు…