– సారపాక కోలాట కళాకారులకు అరుదైన గౌరవం
బూర్గంపహాడ్, అక్టోబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడ సారపాక ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సంప్రదాయ జానపద కళ కోలాటానికి విశేష సేవలందిస్తూ కళావైభవాన్ని చాటుతున్న ఈ బృందానికి బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘భారతీయ కోలాట కళారత్న’ జాతీయ పురస్కారం-2026 నవంబర్ 15న దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రధానం చేయనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కార్యాలయంలో అంతర్జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా ఎంపిక పత్రాలను కోలాట బృందం అందుకుంది. అవార్డుల ప్రధాన…