నాగపూర్: సింబయాసిస్ యూనివర్సిటీకి చెందిన నాగపూర్ క్యాంపస్‌లోని ఓ ప్రొఫెసర్(Symbiosis Professor)పై వేటు పడింది. ఆ క్యాంపస్‌లో చదువుకున్న మాజీ విద్యార్థినికి.. ప్రొఫెసర్ అనుచిత మెసేజ్‌లు చేసినట్లు తేలింది. ఇస్లామిక్ మత విధానాలను ఫాలో అవ్వాలని ఆ ప్రొఫెసర్ తన మెసేజ్‌ల్లో కోరినట్లు గుర్తించారు. దీంతో అతన్ని బలవంతపు లీవ్‌పై పంపినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ ప్రవర్తన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే సదరు ప్రొఫెసర్ ఇప్పటికే తన పోస్టుకు రాజీనామా చేసినట్లు…
అయితే ఈ ఘటనలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆరు నెలల క్రితమే ఆ స్టూడెంట్ వర్సిటీ వదిలి వెళ్లింది. నాగపూర్ సిటీ పోలీసులు రిక్వెస్ట్ చేసినా ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. ఆమె తండ్రి కూడా ఫిర్యాదుకు నిరాకరించాడు. ఆ అనుచిత మెసేజ్‌లకు చెందిన ఆధారాలను చూపెట్టలేకపోయారు. అసభ్యకరమైన మెసేజ్‌లే కాకుండా.. ఇస్లామిక్ మత ఆచారాలను ఫాలో అవ్వాలంటూ విద్యార్థిని సదరు ప్రొఫెసర్ ఎంకరేజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా ఏబీవీపీ, వీహెచ్‌పీ ఆందోళన చేపట్టాయి.