Vaddiraju Ravichandra | కొండపోచమ్మ సాగర్ నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించుకుపోతున్నారంటూ వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ కథనం నిరాధారమైనదని పేర్కొంటూ ఆయన తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా నిందారోపణలతో కూడిన కథనాన్ని ప్రచురించడంపై ఎంపీ రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఛానల్, పత్రికలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వాస్తవాలతో సంబంధం లేని కథనాలను ప్రచురించడం సరికాదని పేర్కొన్నారు.