– నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కీలక పరిణామం – జెన్కో సీఎండీ హరీష్, ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు చర్యలు
దామరచర్ల, అక్టోబర్ 15 : యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్ 1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ విధుల నుండి సస్పెండ్ అయ్యారు. ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు జెన్కో సీఎండీ హరీష్ కుమార్ సస్పెండ్ చేశారు. వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్-1ను 10–15 రోజులుగా షట్డౌన్లో ఉంచడంతో, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జనరేషన్ లాస్ జరిగినట్లు అభియోగాలు రావడం, సిబ్బంది సమన్వయం, సమీక్షలు, పెండింగ్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు. గత నెలలోనూ ఆయిల్ స్టాక్ నిర్వహణ లోపాలపై డిఈ ఐడీఓపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ప్లాంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో సీఎండీ హరీష్ కుమార్ గత నెల నుండి సీఎండీ…