Vijay TVK : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కొద్ది రోజులుగా ఇండియా బ్లాక్ పార్టీలు భారీగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో తమిళనాడు, విజయ్ పార్టీ టీవీకే చేరలేదు. సర్కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్తో పార్టీ పలు ప్రకటనలు చేసింది.
కానీ.. ప్రతిపక్షాల ఆందోళనలో మాత్రం పాల్గొనలేదు. అయితే, ఈ అంశంపై తమిళనాడులో విజయ్ కూటమికి చెందిన పార్టీ వీసీకే నేత స్పందించారు. త్వరలోనే టీవీకే కూడా ఇండియా బ్లాక్ ఆందోళనల్లో చేరుతుందని వీసీకే నేత తోల్ తిరుమవలవన్ శుక్రవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల్లో టీవీకే పాల్గొంటుందని వివరించారు. జాతీయ స్తాయి నిరసనల్లో టీవీకే పాల్గొనపోయినప్పటికీ.. ఇటీవల తమిళనాడుకు చెందిన ఇండియా బ్లాక్ నిరసనల్లో మాత్రం పాల్గొంది. ‘‘ఇప్పటికే టీవీకే ఇండియ కూటమిలో చేరింది. వారు ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం.