Skip to content
Search

Telugu film

Ranabaali

Fri 16 Oct 2026 · per Wikipedia's release list

Wikipedia ↗

Coverage from the outlets we read

n = 3 articles from 2 outlets

V6 Velugu ·

Ranabaali Day 5 Collection : ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్న 'రణబాలి' కలెక్షన్స్.. 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

EntertainmentSentiment: positive

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద జోరు పెంచింది. తొలి రోజుల్లో మిశ్రమ వసూళ్లతో సాగిన ఈ సినిమా.. ఐదో రోజు కలెక్షన్లలో పెరుగుదల నమోదు చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రక యాక్షన్ డ్రామా ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అక్టోబర్ 20, మంగళవారం ‘రణబాలి’ ఇండియా నెట్ వసూళ్లు రూ.6.75 కోట్లుగా నమోదైనట్లు ట్రెడ్ వర్గాల చెబుతున్నాయి. సోమవారం వచ్చిన రూ.5.40 కోట్లతో పోలిస్తే మంగళవారం కలెక్షన్లు సుమారు 25 శాతం పెరగడం విశేషం. దీంతో ఐదు రోజుల్లో సినిమా ఇండియా నెట్ వసూళ్లు రూ.36.20 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.52.40 కోట్లకు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. శుక్రవారం రూ.9.25 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం, శనివారం రూ.7.30 కోట్లు, ఆదివారం రూ.7.50 కోట్లు వసూలు చేసింది. సోమవారం వసూళ్లు తగ్గినా, మంగళవారం మళ్లీ పుంజుకోవడం సినిమాకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.

V6 Velugu ·

Ranabaali Censor Report: 'రణబాలి' సెన్సార్ రిపోర్ట్‌లో క్రేజీ ట్విస్ట్.. ఒక్క కట్ లేకుండా విజయ్-రష్మిక మూవీకి U/A సర్టిఫికెట్!

EntertainmentSentiment: positive

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ అప్‌డేట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. ప్రచార చిత్రాల్లోనే తీవ్ర హింసతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా సూచించకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది.. దీంతో అసలు సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది.

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రణబాలి' బ్రిటిష్ పాలన కాలం నాటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా. 1870ల దక్షిణ భారతదేశంలో కరువు, బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాల నేపథ్యంలో తన ప్రాంత ప్రజల కోసం పోరాడే ఓ యోధుడి కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో రణబాలిగా కనిపించనుండగా, రష్మిక జయమ్మ పాత్రలో నటిస్తోంది. బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Eenadu ·

ranabaali: విజ్జూ.. నేను నీకు ఫ్యాన్‌ గర్ల్‌ను: రష్మిక

EntertainmentSentiment: positive

ఇంటర్నెట్ డెస్క్: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. రష్మిక కథానాయిక. దసరా కానుకగా అక్టోబరు 16న (ranabaali release date) ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఈ చిత్ర ప్రి-రిలీజ్‌ వేడుక నిర్వహించారు. రష్మిక మాట్లాడుతూ.. ‘‘ఇన్‌స్టా ఓపెన్‌ చేస్తే జయమ్మ, రణబాలి గెటప్పుల్లో కొన్ని వేల రీల్స్‌ కనిపిస్తున్నాయి. ఏమి అభిమానం చూపిస్తున్నారబ్బా..! మీ అభిమానం చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంది. అందుకు థ్యాంక్స్‌ చెబుతున్నా. ఈ సినిమా సెట్‌కు వెళ్లాలంటే భయమేసేది. ఎందుకంటే అందరూ అంత సీరియస్‌గా…

యూనిట్‌ మొత్తం ఈ సినిమాపై ఎంత ప్యాషన్‌తో పనిచేస్తున్నారో అప్పుడు అర్థమైంది. నేను తొలి ప్రేక్షకురాలిగా చెబుతున్నా. ఈ సినిమా మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నాకు ఏ సినిమా వచ్చినా అది నాకు రాసిపెట్టి ఉందని భావిస్తా. ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను ఎంతో రుణపడి ఉన్నట్లు అనిపించింది. ఈ సినిమాలో విజయ్‌కి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. జయమ్మ అనేది తన తల్లి పేరని రాహుల్‌ చెప్పారు. అక్కడే మనసు కరిగిపోయింది. జయమ్మ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. విజయ్‌తో పెళ్లి అయినట్లు అనిపించలేదు. ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌లా ఉంది. విజ్జూ.. నీ వర్క్‌కు నేను ఫ్యాన్‌ను. రణబాలితో నీ శ్రమ…

Checked 21 Oct 2026 20:03 IST