We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The Hyderabad High Court dismissed a petition filed by Chandramma and her adoptive son regarding a 1999 property dispute in Metpalli, Jagtial district.
హైదరాబాద్, వెలుగు: వీలునామా ద్వారా ఆస్తులు ఇతరులకు బదలాయించినప్పుడు దాన్ని రద్దు చేసినట్లు చెప్పే వారే అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తిపై తమకు హక్కులు ఉన్నాయంటూ వాదనలు చేయడం మాత్రమే సరిపోదని, యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు తప్పనిసరిగా చూపాలని పేర్కొంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆస్తికి సంబంధించి 1999లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రమ్మ, ఆమె దత్తపుత్రుడు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. చంద్రమ్మ స్త్రీధనంతో సంపాదించిన ఆస్తులను ఆమె భర్త లక్ష్మారెడ్డి వీలునామా ద్వారా ట్రస్టుకు కేటాయించడం చెల్లదని, ఆ తర్వాత ఆ వీలునామాను రద్దు చేశారని పిటిషనర్లు వాదించారు.
In Rajam, Vizianagaram district, a fire broke out at the Navadurga Automobile and Lubrication shop on Palakonda Road after midnight on Sunday. Firefighters controlled the blaze, and the local fire officer estimated property damage of up to Rs.
రాజాం: విజయనగరం జిల్లా రాజాం పట్టణం పాలకొండ రోడ్డులోని నవదుర్గా ఆటోమొబైల్స్ అండ్ లూబ్రికేషన్ దుకాణంలో ఆదివారం రాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుకాణంలో ట్రాక్టర్ విడిభాగాలు, లూబ్రికేటింగ్ ఆయిల్స్, గ్రీజు, బెల్టులు నిల్వ ఉండటంతో వాటికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి అశోక్ అంచనా వేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీపావళి సందర్భంగా వీధిలో బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు దుకాణంపై పడటంతోనే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆంధ్రప్రదేశ్లో దీపావళి వేడుకల వేళ పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. బాణాసంచా కారణంగా సంభవించిన అగ్నిప్రమాదాలతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి.వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా గన్నవరంలోని ఒక గృహోపకరణాల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సదరు దుకాణానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో బాణాసంచా కారణంగా ఒక ఆయిల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి.…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.