We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజుల పాటు కేటీఆర్ బస్సు యాత్ర చేపడతారని తెలిపారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర, గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుందని వివరించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తూ, రైతుల ఇబ్బందులను ఆధారాలతో ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టమైన దీక్షా దివస్ను పురస్కరించుకుని నవంబర్ 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు గంగుల…
Former minister and Karimnagar MLA Gangula Kamalakar announced that BRS Working President KTR will lead a two-day bus yatra from November 11 to 14 to highlight farmers' irrigation issues in the Godavari catchment region.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 1 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. 2009 నవంబర్ 29న అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ అలుగునూర్ వద్ద అరెస్టయిన చారిత్రక సందర్భాన్ని పురసరించుకొని బీఆర్ఎస్ దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు ప్రకటించారు.
రైతులు ఎదురొంటున్న సాగునీటి సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా చేపట్టే బస్సుయాత్ర మేడిగడ్డ నుంచి ప్రారంభమై గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై కరీంనగర్లోని శ్వేతా హోటల్లో ఆదివారం సాయంత్రం గంగుల అధ్యక్షతన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
గువాహటి: కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించిన నిండు గర్భిణీ అయిన మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు సహకరించడంతో ఆ బస్సులోనే ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. (Woman Delivers Baby On Bus) అస్సాంలో ఈ సంఘటన జరిగింది. నిండు గర్భిణీ అయిన మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతి నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న బస్సులో ప్రయాణమైంది. మార్గమధ్యలో ఆ మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆమెకు ప్రసవం కాబోతోందని తెలుసుకున్న ప్రయాణికులు డ్రైవర్ను అలెర్ట్ చేయగా రోడ్డు పక్కన బస్సును ఆపాడు.
కాగా, బస్సులోని మగ ప్రయాణికులంతా కిందకు దిగారు. కొందరు మహిళలు దుప్పట్లు, బట్టలతో బస్సులో ఒక తాత్కాలిక గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహిళ కాన్పు కోసం వారు సహకరించారు. దీంతో ఆడ బిడ్డను ఆమె ప్రసవించింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.