We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం తెలిపిన ప్రకారం, దేశంలో వ్యవస్థాగత ప్రాముఖ్యం కలిగిన బ్యాంకులు (డి-ఎస్ఐబీలు)గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులను కొనసాగిస్తున్నారు.
ముంబయి: దేశంలో వ్యవస్థాగత ప్రాముఖ్యం కలిగిన బ్యాంకులు (డి- ఎస్ఐబీలు)గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులను కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం తెలిపింది. ఈ మూడు బ్యాంకులు తమ రిస్క్ వెయిటెడ్ అసెట్స్‌లో (ఆర్డబ్ల్యూఏ) కొంత శాతాన్ని అదనపు మూలధన నిల్వలుగా కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ‘కేపిటల్ కన్జర్వేషన్ బఫర్’కు ఇది అదనం. 2026 మార్చి 31 నాటికి ఆయా బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాజా నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. దీని ప్రకారం ఎస్బీఐ తన ఆర్డబ్ల్యూఏలో 0.8% అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 మూలధనాన్ని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడిందని, పన్నుల చెల్లింపుల వల్ల బ్యాంకుల వద్ద క్యాష్ నిల్ అయిపోవడంతో అవి డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.
ముంబయి: బ్యాంకులు తమ ఖాతాదార్ల కోసం తప్పనిసరిగా ‘స్టాప్ స్విచ్’ని ఇన్స్టాల్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రతిపాదించింది. తద్వారా తమ ఖాతా నుంచి జరిగే ఏ డెబిట్ లావాదేవీనైనా రద్దు చేసుకునేందుకు ఖాతాదార్లకు వీలు కల్పించాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ బ్యాంక్ లావాదేవీ(ఈబీటీ)లకు మరింత భద్రత కల్పించాలని, వినియోగదార్లకు తమ ఖాతాలపై నియంత్రణ మరింత పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఒక్కసారి స్టాప్ స్విచ్‌ను యాక్టివేట్ చేస్తే.. కస్టమర్ తరఫు నుంచి చేసే డెబిట్ లావాదేవీలు, కొత్త చెల్లింపు మాండేట్ల సృష్టి, కొత్త స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా థర్డ్ పార్టీ చెల్లింపు యాప్‌లపై కొత్తగా యూపీఐ…
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. దాదాపు 5 నెలల తర్వాత భారత బ్యాంకుల వద్ద క్యాష్ నిల్ అయిపోవడంతో.. అవి డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. పన్నుల చెల్లింపుల రూపంలో భారీగా డబ్బు బయటకు వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది.
నవంబర్ 21 నాటికి ఆర్బీఐ బ్యాంకులకు రూ. 12వేల 825 కోట్లను సమకూర్చింది. జూన్ 29 తర్వాత ఆర్బీఐ ఇలా నిధులను విడుదల చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా.. తక్షణ నగదు కష్టాలను తీర్చేందుకు సోమవారం నాడు రెండు విడతల్లో ఏకంగా రూ. లక్ష కోట్ల భారీ మొత్తాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేసింది. ఈ నిధులు రాబోయే రోజుల్లో తిరిగి ఆర్బీఐకి వెళ్లేలా స్వల్పకాలిక లావాదేవీల ద్వారా సర్దుబాటు చేసింది.
బంగారం ధరల పతనం.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంకుల నోటీసులు - Visalaandhra
Not analysed for framing
మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం కావడం కొత్తగా కొనుగోలు చేసే వారికి ఊరటనిచ్చినప్పటికీ, ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. తనఖా పెట్టిన బంగారం విలువ తగ్గడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలకు మార్జిన్ కాల్ నోటీసులు జారీ చేస్తున్నాయి. బకాయి ఉన్న రుణంలో కొంత మొత్తం చెల్లించాలని, లేదా తగ్గిన విలువకు సమానంగా అదనపు నగదు జమ చేయడమో, మరింత బంగారం తనఖా పెట్టడమో చేయాలని స్పష్టం చేస్తున్నాయి.గడచిన కొన్ని నెలల్లో బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా తగ్గాయి. గతంలో పసిడి ధరలు భారీగా ఉన్న సమయంలో రుణాలు తీసుకున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా…
మనకు ఒక్కోసారి అనుకోకుండా డబ్బు అవసరం పడుతుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం లేదా ఇతర అత్యవసర కోసం డబ్బు కావాల్సి రావచ్చు. ఇలాంటి సమయాల్లో చేతిలో సరిపడా డబ్బు లేకపోతే చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటుంటారు.
ప్రస్తుతం బ్యాంకులు కూడా కస్టమర్ల అవసరాలను బట్టి రకరకాల లోన్లు అందిస్తున్నాయి. వీటిలో హోమ్ లోన్స్, వాహన లోన్లు, గోల్డ్ లోన్లు, వ్యాపార లోన్లు, పర్సనల్ లోన్ కామన్.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.