We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చైనాకు ఎన్విడియా చిప్ ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు అవసరం లేదని తెలిపారు. మెగాస్పీడ్ సంస్థ ద్వారా పాత చిప్స్ విక్రయాలపై కొత్త నియంత్రణలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
వాషింగ్టన్: చైనాకు ఎన్విడియా చిప్ ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు అవసరం లేదని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థ ద్వారా చైనా కంపెనీలు రిమోట్ పద్ధతిలో అత్యాధునిక చిప్స్‌ను ఉపయోగించకుండా ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించడంతో, పాత చిప్స్ విక్రయాలపై కొత్త నియంత్రణలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా, మెగాస్పీడ్ సంస్థతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్విడియా, ఏఎండీ సంస్థలు చైనా కంపెనీలకు 8,50,000 కంటే ఎక్కువ చిప్‌లను విక్రయించడానికి వాణిజ్య శాఖ అనుమతి ఇచ్చిన…
అమెరికా కాంగ్రెస్ కమిషన్ తాజా నివేదిక ప్రకారం, భారతదేశ ఆర్థిక, సైనిక ఎదుగుదలను చైనా ఒక భారీ సవాలుగా భావిస్తోంది. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక, సాంకేతిక సహకారం అందించిందని నివేదిక పేర్కొంది.
అమెరికా కాంగ్రెషనల్ కమిటీ హెచ్చరిస్తూ, భారత్ అభివృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహాలను అమలు చేస్తోందని పేర్కొంది. భారత్‌కు కీలకమైన పారిశ్రామిక ముడిపదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం సరఫరాపై ఆంక్షలు విధించడంతోపాటు సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి పెంచుతోందని తెలిపింది.
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక, సైనిక ఎదుగుదలను చైనా తన ముందున్న భారీ సవాల్‌గా భావిస్తున్నదని అమెరికా కాంగ్రెస్ కమిషన్ తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌ను బలహీనపరిచేందుకు చైనా పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నదని పేర్కొంది. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక, సాంకేతిక సహకారం అందించిందని తెలిపింది. చైనా నేరుగా ఘర్షణల్లో పాల్గొనకపోయినా, పాక్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడిందని వెల్లడించింది.
చైనా ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఇంటర్వ్యూలలో ఆ దేశ విమాన తయారీ సంస్థ ఏవీఐసీ ఇంజినీరింగ్ జాంగ్ హెంగ్ఘర్షణ సమయంలో చైనా నిపుణులు పాకిస్తాన్లో ఉండి, సాంకేతిక సహాయం అందించినట్లు చెప్పారని నివేదిక ప్రస్తావించింది. మరోవైపు భారత్ చైనా మధ్య 2024 అక్టోబర్‌లో సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపునకు ఒప్పందం కుదిరినా, వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా కొత్త సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నదని పేర్కొంది.
వాషింగ్టన్: ఇండియా పట్ల చైనా కపట బుద్ధి మరోసారి బయటపడింది. భారత్ ఎదుగుదలను ఓర్వలేక డ్రాగన్ కంట్రీ పన్నుతున్న కుతంత్రాలను అమెరికా బట్టబయలు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా అండగా నిలిచిందని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ సంచలన విషయాలు వెల్లడించింది. భారతదేశ ఆర్థిక, వ్యూహాత్మక ఎదుగుదలను అరికట్టే విస్తృత ప్రణాళికలో భాగంగానే పాకిస్తాన్‌కు చైనా సైనిక, సాంకేతిక సహయం అందించిందని తెలిపింది. అలాగే, భారతదేశాన్ని అదుపులో ఉంచడానికి సరిహద్దు వెంబడి సైనిక ఒత్తిడి, పారిశ్రామిక సరఫరాలపై చైనా ఆంక్షలను ఉపయోగిస్తోందని కూడా వెల్లడించింది.
యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన 2026 వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత్‌పై చైనా, పాకిస్తాన్ చేస్తోన్న కుట్రలను బహిర్గతం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే పాకిస్థాన్‌కు అండగా నిలిచిందని తెలిపింది.
భారతదేశంలో అమ్ముతున్న బంగారంలో కొత్త రకం కల్తీ బయటపడింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న ‘రీనియం’ రహస్య పౌడర్‌ను బంగారంలో కలిపి వినియోగదారులను మోసం చేస్తున్నారు చాలా మంది వ్యాపారులు. ఈ రీనియం మెటల్ ద్వారా చేసే గోల్డ్ కల్తీని గుర్తించడంలో అత్యాధునిక హాల్‌మార్కింగ్ యంత్రాలు కూడా ఫెయిల్ కావటం కస్టమర్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ చేపట్టిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో ఈ బంగారం కల్తీ గుట్టు బయటపడింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక నగల వ్యాపారి సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా బంగారంలో రాగి లేదా వెండిని కలిపితే హాల్‌మార్క్ మెషీన్లు వెంటనే వాటిని పసిగడతాయి. కానీ రీనియం పౌడర్‌ను కలిపితే అవి ప్యూర్ గోల్డ్‌గానే చూపిస్తున్నాయి. దీనినే చాలా మంది వ్యాపారులు ప్రస్తుతం బంగారం రేట్ల పతనం సమయంలో విచ్చలవిడిగా వాడేస్తున్నారంట. దీంతో రేట్లు తగ్గాయని ఆనందపడాలో లేక తాము కొంటున్న బంగారం నిజమైనదో, రీనియం కలిపిందో తెలియక చాలా మంది కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘అయిన వారికి ఆకుల్లో పెట్టి.. కాని వారికి కంచాల్లో’ అన్న సామెత రష్యా అధినేత పుతిన్‌కు చైనాలో అనుభవంలోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చైనాతో సన్నిహితంగా ఉండే రష్యా అధినేతను పట్టించుకోకుండా.. నిత్యం బీజింగ్‌ను విమర్శించే ట్రంప్‌ను మంచి చేసుకునే యత్నం జిన్‌పింగ్ చేసినట్లు వీటిల్లో పేర్కొన్నారు. షెన్జెన్ పర్యటనలో అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్ (Trump)తో పోలిస్తే రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌కు చైనా (Chian)లో తక్కువ ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు స్వయంగా తానే వెళ్లిన జిన్‌పింగ్ (Xi Jinping).. రష్యా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.