Andhra Jyothy ·
Trending search
4 analysed of 4 matched articles · 3 outlets · checked 28 Nov 2026 19:57 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 4 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రాబోతోంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరంలో పర్యటించి, ఈనెల లేదా వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకురాబోతోందని వ్యాఖ్యానించారు.
Eenadu
PM Modi: ‘ప్రతిపక్షాలు ఎప్పటికీ అడ్డుకోలేవు’.. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ
Andhra Jyothy ·
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ రిజర్వేషన్ల అమలును ఎప్పటికీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియో విడుదల వేశారు. మహిళా రిజర్వేషన్లపై తాము ‘నారీ శక్తి’కి మాట ఇచ్చామని, దానిని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. డీలిమిటేషన్-మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఈనెల 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ రిజర్వేషన్ల అమలును ఎప్పటికీ అడ్డుకోలేవని స్పష్టం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
V6 Velugu
విద్యాసంస్థల్లో మత్తుకు చెక్ పెట్టేలా కొత్త చట్టం..యాజమాన్యాల జవాబుదారీతనంతో ప్రత్యేక బిల్లు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురానుంది. ఈ ముసాయిదా రూపకల్పన కోసం నియమించిన కమిటీ ఈ నెల 30న సెక్రటేరియెట్ లో సమావేశం కానుంది.
‘‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల (Women's Quota)కు సంబంధించి దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. దీని కోసం ప్రయత్నం చేస్తున్నవారిలో నేనూ ఒకడిని. ఎంతోమంది మహిళలు ఈ విషయాన్ని నా ఎదుట లేవనెత్తుతూనే ఉన్నారు. ఎంతోమంది సోదరీమణులు లేఖలు పంపారు. దేశంలో 100 శాతం నారీశక్తి ఆశీర్వాదం మాపై ఉంది. మహిళా రిజర్వేషన్ల దారిలో వచ్చే ప్రతి అడ్డంకిని తొలగిస్తాం. ఇందుకోసం మేం దృఢ సంకల్పంతో ఉన్నాం. కేవలం సమయం కోసం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికీ దీన్ని అడ్డుకోలేవు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాల జవాబుదారీతనాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ‘తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ అబ్యూజ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటబిలిటీ) బిల్లు–2026’ ముసాయిదా రూపకల్పన కోసం నియమించిన కమిటీ ఈ నెల 30న సెక్రటేరియెట్ లో సమావేశం కానుంది.
కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా ఉన్న ఈ కమిటీ సమావేశానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్, టెక్నికల్, ఒకేషనల్ విద్యాసంస్థలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలన్నింటికీ ఈ బిల్లు వర్తించనుంది. దీనికి గత నెలలో సీఎస్ సంజయ్ జాజు 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
Eenadu ·
ఖమ్మం కార్పొరేషన్: సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించే కీలక సాధనమని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో కొత్తగూడెం జిల్లాకు చెందిన 40 మంది అధికారులకు సమాచార హక్కు చట్టం పై నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇతర శాఖలకు దరఖాస్తులను బదిలీ చేసే సందర్భంలో చట్టంలోని నిబంధనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రాంతీయ శిక్షణ మేనేజర్ ఆనంద్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.