Namasthe Telangana ·
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
Team Idupu Kayitham | విజయదసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) సినిమా బృందం చేరింది. దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ శుభాకాంక్షలతో పాటు సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ను విడుదల చేయగా, ప్రస్తుతం అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. దుర్గా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ మేకర్స్ తమ అధికారిక ఖాతాల ద్వారా…
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో రాబోతుండగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా.. నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.