We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
సూర్యాపేట జిల్లాలో రైస్ మిల్లర్లకు, అధికారులకు మధ్య కుమ్మక్కు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు కోట్ల విలువ లేని మిల్లులకు 15 కోట్ల నుంచి 25 కోట్ల విలువైన ధాన్యం కేటాయించినట్లు తెలిసింది. గత మూడు సీజన్లలో దాదాపు 35 మిల్లులకు 500 కోట్ల పైచిలుకు విలువ చేసే ధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
CMR Rice Scam | సూర్యాపేట, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రైస్ మిల్లర్ల అక్రమాలకు అంతే లేకుండాపోయింది. కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని తెగనమ్ముకొని పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.నాలుగు కోట్ల విలువ చేయని రైస్ మిల్లులకు రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల విలువైన ధాన్యం కేటాయించారు. ఇలాంటివి సూర్యాపేట జిల్లాలో దాదాపు 35 వరకు ఉండగా వాటికి గత మూడు సీజన్లలో రూ.500కు పైనే కోట్ల విలువ చేసే ధాన్యం ఇచ్చినట్టు తెలిసింది. వీటి నుంచి సివిల్ సప్లయీస్కు రావాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) 30 శాతంలోపే ఉండటం గమనార్హం.
ఇటీవల అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన మిల్లుల్లో రూ.నాలుగు కోట్ల విలువ చేయలేని మిల్లులు ఎనిమిది ఉన్నాయి. మిగిలిన మిల్లులు కూడా ఉండేనా ప్రభుత్వాన్ని నిలువునా ముంచేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే విస్తుగొలిపే అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమని 40 ఏండ్లుగా మిల్లు నడిపిస్తున్న ఓ సీనియర్ మిల్లర్ అంటుండగా, సివిల్ సప్లయీస్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది సైతం అంతర్గతంగా అక్రమాలు వాస్తవమేనని ధ్రువీకరిస్తున్నారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఏకగ్రీవ పంచాయతీలకు అభివృద్ధిలో ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకమని, అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం మళ్లింపు అక్రమాలపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. 6,700 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు సేకరించినట్లు సమాచారం.
అవనిగడ్డ: ఏకగ్రీవ పంచాయతీలకు అభివృద్ధిలో ప్రాధాన్యం ఇస్తానని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకమని, అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులను ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఎన్నుకోవాలన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయతీలకు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆధిపత్య ధోరణులకు స్వస్తి పలికి గ్రామ వికాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం అందించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అభ్యర్థులను…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తెలంగాణలో ధాన్యం మళ్లింపు అక్రమాలపై ఈడీ దూకుడు పెంచింది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై దర్యాప్తును ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం అక్రమంగా మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుమారు రూ.6,700 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అంచనా వేస్తున్నారు.
2021-22 నుంచి ఇప్పటివరకు జరిగిన ధాన్యం మళ్లింపు వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే నమోదైన కేసుల వివరాలను సేకరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న రైస్ మిల్లులపై నిఘా పెట్టారు. ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లులకు కేటాయించిన తర్వాత ఎంత పరిమాణంలో బియ్యం తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు? ఎంత మేరకు లోటు ఏర్పడింది? అనే అంశాలపై పౌరసరఫరాల శాఖ రికార్డుల ఆధారంగా లెక్కలు తీస్తున్నారు.
Civil Supply | హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : బహిరంగ మార్కెట్లో రైతుల వడ్లకు భారీ డిమాండ్ పలుకుతుండగా.. సివిల్ సైప్లె ధాన్యం కొనుగోలుకు దిక్కేలేకుండా పోయింది. రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుంటే.. సివిల్ సైప్లె ధాన్యం కొనుగోలుకు ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. మిగులు ధాన్యాన్ని విక్రయించేందుకు రెండుసార్లు వేలం వేసినప్పటికీ స్పందన కరువైంది. దీంతో వేలంలో ధాన్యం అమ్ముడుపోక సివిల్ సైప్లె శాఖకు నష్టాలు పెరిగిపోతున్నాయి. సుమారు రూ.4 వేల కోట్ల ధాన్యం గోదాముల్లో, మిల్లుల్లోనే మూలుగుతున్నది. ఆ ధాన్యాన్ని అమ్మి నష్టాలు పూడ్చుకొని కష్టాల నుంచి బయటపడేందుకు సివిల్ సైప్లె…
ఓవైపు ఇప్పటికే వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి వారికి అవసరమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరోసారి సివిల్ సైప్లె ధాన్యం వేలం వేస్తే ఫలితం దక్కుతుందా? లేదా? అనే సందేహాలు ఆ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మిగులు ధాన్యం వేలం కోసం ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు టెండర్లను ఆహ్వానించింది. అక్టోబర్లో తొలిసారి 11.72 లక్షల టన్నుల ధాన్యం వేలం వేసింది. ఆ టెండర్లకు బిడ్డర్ల నుంచి స్పందన కరువై కేవలం 50 వేల టన్నులే అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో మరికొంత ధాన్యం జత చేసి గత నెల 22న 16.93 లక్షల టన్నుల విక్రయానికి వేలం వేసింది. ఈసారి కూడా సివిల్ సైప్లె శాఖకు నిరాశ తప్పలేదు. ఇందులో కేవలం 3…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.