We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి డిసెంబర్ 4న లక్నోలో జరగనుంది. రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను 2026 డిసెంబర్ 4న లక్నోలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2025 జూన్‌లో క్రికెటర్లు, పలువురు ప్రముఖులు హాజరైన వేడుకలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. యూపీలోని మచ్చలిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియా, రింకుల వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇప్పటికే ప్రింట్ అయ్యాయి.
ఈ పెళ్లి వేడుక రామాడా బై విండమ్ లక్నో హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ నెల చివరలో దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ కోసం రింకూ సింగ్ వెళ్లాల్సి ఉంది. ఈ లోపు పెళ్లికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని రింకూ డిసైడ్ అయి అప్పుడే పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు. దీపావళి సందర్భంగా తన సొంతూరైన అలీగఢ్‌కు వెళ్లి, తన కుటుంబంతో మధుర క్షణాలను గడుపుతూనే.. పెళ్లి ఏర్పాట్లను కూడా చూసుకున్నాడు.
According to the CITU district committee, ASHA workers in Telangana, who have been working for 20 years, are striking starting December 15 to demand a monthly salary of Rs. 18,000, job security, and other benefits. CITU district vice president A.
Asha workers | ఖలీల్ వాడీ, నిజామాబాద్ 10 : తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏవోకు సమ్మె నోటీసును మంగళవారం అంజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశ వర్కర్లు అత్యంత బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ప్రజలకు అనేక సేవలందిస్తూ గర్భిణీలను ఆసుపత్రిలో డెలివరీ అయ్యేవిధంగా చూస్తూ తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు రాకుండా ప్రయత్నిస్తున్నారని కరోనా మమ్మరిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉదయం…
గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పారితోషకాలు పెట్టకుండా ఉండటంతో నిత్యవసర సరుకులు ధరలు పెరిగి వ సరిపోవటం లేదని ఆయన అన్నారు 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు వాటిని పరిష్కరించలేదని అన్నారు.
హైదరాబాద్, వెలుగు: స్కూల్ విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, విమర్శనాత్మక దృక్పథం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను వెలికితీసేందుకు సోషల్ సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్ర విద్యాశాఖ బడ్జెట్ ఆమోదంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయిలో, డిసెంబర్ 10న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సోమవారం ప్రకటించారు.
ప్రతి బడి నుంచి ఒక ప్రాజెక్ట్‌ను మాత్రమే అనుమతిస్తారని, గరిష్టంగా ఇద్దరు విద్యార్థులు దీనిని ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఉత్తమ టాప్–2 ప్రాజెక్టులను డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపాలని అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించారు. ప్రాజెక్టుల తయారీలో థర్మాకోల్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, హానికర రసాయనాల వినియోగాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.