Eenadu ·
GATE 2027 Mock Tests: గేట్ 2027 ప్రిపేర్ అవుతున్నారా? మాక్ టెస్టులు ఇవిగో
ఇంటర్నెట్ డెస్క్: గేట్ పరీక్ష (GATE 2027) రాసే విద్యార్థులకు కీలక అప్డేట్. ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్(IIT Madras) మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు తమ సన్నద్ధతను పరీక్షించుకొనేందుకు గేట్ 2027 వెబ్సైట్లో ఈ మాక్ టెస్టులను రాసేందుకు వీలు కల్పించింది. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) పరీక్షను ఈసారి ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది.
గేట్ మాక్ టెస్ట్‌ల కోసం క్లిక్ చేయండి