We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 14న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిరిబాబు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గిరిబాబు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గిరిబాబు చివరి సినిమా ఇదే!
Veteran Telugu film actor Giribabu passed away in a private hospital in Hyderabad on Saturday after a period of illness. Born in Prakasam district in 1946, he was known for his roles in hundreds of films and also worked as a producer and director.
Veteran Telugu actor, director, and producer Giribabu (80) passed away at a private hospital in Hyderabad after a period of illness. He is survived by his sons, actors Raghu Babu and Bose Babu, and left behind a legacy in South Indian cinema.
Entertainment — not analysed for political framing
Giri Babu Death: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలక్షణమైన పాత్రలతో అలరించిన సీనియర్ యాక్టర్ గిరిబాబు ఇక లేరు. ఆయన ఇవాళ (2026, నవంబర్ 14, శనివారం) కన్నుమూశారు. 1973లో జగమే మాయ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి సుమారు 600కు పైగా మూవీల్లో నటించారు. ఆయన కుమారుడు రఘుబాబు టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గిరిబాబు మరణ వార్త విని సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు.. ఆయన 1946 జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలోని ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే కళారంగం, నాటకాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ రంగం వైపు నడిచారు. ఎన్నో కలలతో అవకాశాల కోసం మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నగరానికి వెళ్లి అనేక కష్టాలు పడ్డారు. ఇక 1973లో వచ్చిన 'జగమే మాయ' మూవీతో విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన ఫస్ట్ సినిమాతోనే నటుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు గిరిబాబు.
ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా కొరిశపాడు రావినూతల గ్రామంలో జన్మించిన ఆయన ‘జగమే మాయ’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలాది చిత్రాల్లో నటించిన ఆయన, చివరిగా 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో కనిపించారు. ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజిత్’, తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’ ‘నీ సుఖమే నే కోరుకున్నా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో…
Actor Giribabu | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
Entertainment — not analysed for political framing
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (యెర్రా శేషగిరిరావు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు ఆయన హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు.
గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. ఆయన 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై తీవ్రమైన ఆసక్తి ఉండటంతో, పాఠశాల రోజుల్లోనే అనేక నాటకాల్లో చురుగ్గా పాల్గొని తనలోని నటుడిని బయటకు తీశారు. సినిమాల్లో రాణించాలనే బలమైన కోరికతో ఆ రోజుల్లో మద్రాసు వెళ్లారు. ఆ తర్వాత 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఏకంగా 600లకు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించారు.
టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Entertainment — not analysed for political framing
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 14న తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన గిరిబాబు మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
ఈ విషయం తెలుసిన పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
Entertainment — not analysed for political framing
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా కొరిశపాడు రావినూతల గ్రామంలో జన్మించిన ఆయన ‘జగమే మాయ’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజిత్’, తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’ ‘నీ సుఖమే నే కోరుకున్నా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు.…
పాతతరం నుంచి నేటి తరం వరకూ నాలుగు దశాబ్దాలుగా చిత్ర రంగంలో రాణించిన నటుడు గిరిబాబు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. రైతు కుటుంబంలో జన్మించిన శేషగిరిరావు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి కనబరిచేవారు. ఊళ్లో ఉన్న టూరింగ్ టాకీస్‌లో ఎక్కువ సమయం గడిపేవారు. అంతా ‘సినిమా పిచ్చోడు’ అనేవారు. నటనలో రాణించాలనే సంకల్పం అప్పుడే ఏర్పడింది. తొలుత నాటకాలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన సొంతంగా నాటక సమాజాన్ని కూడా స్థాపించారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలు, మిత్రుల తోడ్పాటుతో సినీ రంగంవైపు అడుగులు వేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించిన నటుల్లో గిరిబాబు ఒకరు. రంగస్థలం నుంచి నట…
ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు జన్మించారు. సుమారు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. నాలుగు దశాబ్దాలకు పైగా నటుడిగా రాణించారు. ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజీత్’, తదితర చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 👉మరిన్ని వివరాలు
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.