We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Following the conclusion of Dasara holidays, heavy traffic was reported across Hyderabad, with vehicles returning from various districts. The congestion was exacerbated by the immersion processions for Durga Mata idols and the reopening of schools and colleges.
దసరా సెలవులు ముగించుకుని జనాలు హైదరాబాద్ బాట పట్టారు. దీంతో సిటీ వచ్చే అన్ని రూట్లు వాహనాలతో రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్ సమీపంలోకి వచ్చే సరికి ట్రాఫిక్ భారీగా పెరిగి వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. 2026 అక్టోబర్ 22న (గురువారం ) హైదరాబాద్‌లోని ప్రధాన హైవేలు, ఆర్టీరియల్ రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యాసంస్థలు తెరుచుకోవడానికి ముందు ప్రజలు నగరానికి చేరుకోవడంతో రోడ్లు మెల్లగా కదులుతున్నాయి.
విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై ఉదయం నుంచే మంగళ్‌పల్లి నుంచి అవుటర్ రింగ్ రోడ్ (ORR) వైపు వాహనాలు క్యూ కట్టాయి. నాగ్‌పూర్, ముంబై, వరంగల్ హైవేలపై కూడా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి (మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి) తిరిగి వస్తున్న ప్రయాణికులతో రోడ్లు నిండిపోయాయి.
The Telangana government extended the strike ban for Hyderabad Water Works employees by another six months, citing water scarcity caused by El Nino. O. No. 955) was issued to ensure continuous water supply and distribution services.
Following the Dasara holidays, commuters returning to Hyderabad from their hometowns caused a massive traffic jam on the Hyderabad–Vijayawada National Highway.
హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో చౌటుప్పల్‌లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. అలాగే పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‌లు ఓపెన్ చేశారు. దసరా సందర్భంగా 10 రోజుల్లో జాతీయ రహదారిపై 7 లక్షల వాహనాల రాకపోకలు కొనసాగించాయని అధికారులు తెలిపారు. కాగా, పండుగ నేపథ్యంలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనివ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుట్యాంక్బండ్…
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Analysis pending
సినిమా ప్రేమికులకు హైదరాబాద్ నగరంలో మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. టాలీవుడ్లో బిగ్ స్క్రీన్ సినిమా అనుభూతిని మరింత పెంచేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణా సినిమాస్ (Aparna Cinemas) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన విప్రో సర్కిల్ (Wipro Circle) దగ్గర ఒక భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ మల్టీప్లెక్స్ ఏకంగా 12 స్క్రీన్లతో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా ఇందులో ఒక అడ్వాన్స్డ్ ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్ కూడా ఉండబోతుండటం విశేషం. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) ప్రాంతంలో ఏఎంబీ విక్టరీ ఐమ్యాక్స్ (AMB Victory IMAX) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుండగా.. ఇప్పుడు తాజాగా విప్రో సర్కిల్ వద్ద కూడా మరో ఐమ్యాక్స్ రానుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హైదరాబాద్, వెలుగు: సర్ అంశంపై రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ఇతర కాక్రోచ్ పార్టీలు చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రకటించారు. ఈ పార్టీల తీరును, వారి కుట్రలను ప్రజల్లో నిలదీసేందుకు నవంబర్ 1న హైదరాబాద్ లో తానే పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ డ్రామాలను తిప్పికొట్టేందుకు కార్యాచరణను ముమ్మరం చేస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీసులో అన్ని జిల్లాల అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ భేటీలో జిల్లాల వారీగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలను ఖరారు చేస్తామన్నారు.
హైదరాబాద్, వెలుగు: భారత్–దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నారు. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీఐ).. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక-సాంస్కృతిక శాఖ కలిసి ‘కె-హార్మనీ ఫెస్టా–2026’ (కొరియా కల్చర్ డే) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న 'వన్ లైట్, టూ సిటీస్' అనే థీమ్ తో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ఫెస్టా ఈవెంట్‌కు వేదిక కానుంది.
ఈ వేడుకల్లో రెండు దేశాల ప్రాచీన, సమకాలీన సంస్కృతులను ప్రతిబింబించే ఎన్నో అద్భుత కళారూపాలు ప్రదర్శితం కానున్నాయి. మన నేల కళా ఖ్యాతిని చాటే పేరిణి నృత్యం, ఒళ్లు పులకరింపజేసే డప్పుల దరువు, ఇతర స్థానిక జానపద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
విజయవాడ: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఆంధ్రాను 267 పరుగుల తేడాతో చిత్తుచేసి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను 130 పరుగులకే కుప్పకూల్చింది. హైదరాబాద్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 275 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్‌ను 306/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఆంధ్రాను 184 రన్స్‌కే కట్టడిచేయడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ఆల్‌రౌండర్ తనయ్ త్యాగరాజన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆరు (6/35) వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో…
దసరా వేడుకల్లో భాగంగా 2026 అక్టోబర్ 20 (మంగళవారం) రాత్రి ఉప్పల్ మినీ స్టేడియంలో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఉప్పల్‌కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్‌రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ తెలిపారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ఎస్(BNSS) సెక్షన్ 35 కింద అక్టోబర్ 21న POR నం. 16-03/2025-26తో కేసు నమోదు చేశారు.
దసరా పండుగ ముగిసింది. సొంత ఊళ్లకు వెళ్లిన జనాలు మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో 2026 అక్టోబర్ 21 సాయంత్రం హైదరాబాద్ వచ్చే రూట్లు చీమల బారుల్లాగ వాహనాల రద్దీతో నిండిపోయాయి.
విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల నిలిచిపోయాయి. నార్కట్ పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి పంతంగి టోల్‌ప్లాజా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర హైదరాబాద్ వైపు 9 టోల్ బూత్‌లు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు.
MVSR College | రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దసరా వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఈవెంట్ నిర్వాహకుడు మల్లెల సాకేత్ (22), లైటింగ్ అండ్ సౌండ్స్ పనులతో సంబంధం ఉన్న బత్తుల పునీత్ (21), సాయం నిశాంత్ యాదవ్ (24) ఉన్నారు. అక్టోబర్ 17న కాలేజీలో నిర్వహించిన డాండియా కార్యక్రమంలో వేదిక పక్కన ఏర్పాటు చేసిన ఇనుప ట్రస్ కూలిపోవడంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 22 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 17న దాండియా కార్యక్రమం జరుగుతున్న సమయంలో వేదిక పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇనుప నిర్మాణం విద్యార్థులపై కూలిపోయింది. ఈ ఘటనలో నారాయణదాస్ సోనా చిలిక్తి అనే విద్యార్థిని మృతి చెందింది. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో ట్రస్ నిర్మాణానికి నాలుగు స్తంభాల బదులు రెండింటినే ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం…
దసరా పండగ పూట హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడ జాగీర్ లో బైకును లారీ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( అక్టోబర్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
బండ్లగూడ జాగీర్ లోని కాళీ మందిర్ ఆలయం సమీపంలో జరిగింది ఈ ఘటన. దుర్గామాత ఆలయానికి పూజ కోసం వచ్చిన లారీ అదుపుతప్పి బైకును ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.డాన్ బాస్కో చర్చిలో కార్యక్రమానికి వచ్చి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పూజ సమయంలో లారీ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Analysis pending
Ranbir Kapoor | హైదరాబాద్ వేదికగా జరిగిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) ప్రీ-రీలీజ్ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో రణ్‌బీర్ మొదట ఆంగ్లంలో మాట్లాడి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత సడన్‌గా తెలుగులోకి మారి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
“హైదరాబాద్‌కు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా విలువైనవి” అంటూ రణ్‌బీర్ తెలుగులో మాట్లాడటంతో అక్కడున్న అభిమానులు కేరింతలు కొట్టారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని భావిస్తున్నానంటూ ఆయన సరదాగా నవ్వడం అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది. పక్కనే ఉన్న సాయిపల్లవి ఆయన తెలుగు ఉచ్ఛారణను విని ముఖంపై చిరునవ్వుతో ఎంతో ఆనందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇకపై తాగునీటి బోర్లకే పర్మిషన్ ఇస్తామని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడేవారిపై 'హైడ్రా' సహాయంతో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధిగకారులను సీఎస్ ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఏఎస్ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోయినా వ్యవసాయానికి, గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని.. పరిశ్రమలకు పవర్ కట్ లేదని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో…
సీఎస్ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేకపోవడంతో వచ్చే 110 ఎంజీడీ(మిలియన్ గాలెన్స్ పర్ డే)ల లోటును భర్తీ చేసేందుకు మిషన్ భగీరథ నుంచి 60 ఎంజీడీలు, కృష్ణా నీటిని మళ్లిస్తున్నామని వివరించారు. నవంబర్ 1 నుంచి నిర్మాణ రంగానికి ఎస్టీపీ వాటర్ గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలు చేస్తున్నామని వికాస్ రాజ్, నల్గొండలో ఉపాధి హామీ పనులు పెంచుతున్నామని హరిచందన, కరీంనగర్లో జూన్ వరకు తాగునీటి తిప్పలు లేవని బీడీ ఎక్కా, ఆదిలాబాద్‌లో పశుగ్రాసం కొరత రాకుండా చూస్తున్నామని ఇలంబర్తి…
హైదరాబాద్ సిటీలో ఘోస్ట్ కారు తిరుగుతుంది. ఘోస్ట్ కారు అంటే కారును దెయ్యం డ్రైవ్ చేస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. 20 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్ సిటీలోని అత్తాపూర్‌లో ఘోస్ట్ కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. నంబర్ ప్లేట్‌కు కొంచెం పైన "GHOST" అని రాసి ఉన్న సుజుకి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వైపు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ దూసుకురావడంతో అతనిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. టోలిచౌకిలోని సాలార్ జంగ్ కాలనీ నివాసి అయిన నిందితుడు మహమ్మద్ ఫహద్ ఉద్దీన్, తన నంబర్ ప్లేట్‌కు కొంచెం పైన "GHOST" అని రాయించుకున్నాడు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.