We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా ఓడిపోవటంపై.. ప్రపంచంలోనే అత్యంత హ్యాపీగా ఉన్న దేశం ఏదో తెలుసా ఇరాన్.. అవును.. ట్రంప్ పార్టీ ఓటమి తర్వాత ఇరాన్ దేశం స్పందించింది.
ఇరాన్ పై యుద్ధం వద్దని.. ఇరాన్ పై యుద్ధాన్ని అమెరికా ప్రజలు కోరుకోవటం లేదని తమ ఓట్ల ద్వారా ట్రంప్ కు చెప్పారు.. మాపై యుద్ధాన్ని అమెరికా వాళ్లే ఛీ కొట్టారు అంటూ ఇరాన్ సోషల్ మీడియాలో ఈ కామెంట్లను పోస్ట్ చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ విజయం సాధించిన తర్వాత.. అమెరికా ఓటర్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారనే స్పష్టమైన సందేశం ఇచ్చారంటూ అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఇరాన్ ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బఘేర్ అన్నారు.
US President Donald Trump stated that the US has no immediate plan to strike Iran, dismissing speculation that the US was preparing to escalate tensions after the midterm elections.
Iran issued a nuclear attack advisory to its citizens, suggesting they turn off air conditioners, stay indoors, and shelter in basements for 24 hours to protect against radiation.
[PUBLISHER] reported that the US conducted a secret attack on Iran's Qeshm Island. An American official stated that progress was being made on peace proposals with Tehran. An Iranian news agency reported hearing explosions on the island.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై మరోసారి భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అణు దాడుల భయం వెంటాడుతున్న వేళ ఇరాన్ తన పౌరులకు కీలక సూచనలు (Nuclear Attack advisory) చేసింది. అణు విస్ఫోటం జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలన్న విషయాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. రేడియో ధార్మికత నుంచి రక్షించుకునేందుకు ఏసీలు ఆపివేయాలని, కిటికీలకు దూరంగా ఉండాలని అందులో పేర్కొంది.
పేలుడు తరంగాలు, తీవ్ర వేడి, కాంతి, రేడియో ధార్మికత అనేవి అణు విస్ఫోటంతో కలిగే నాలుగు ప్రమాదాలని ఇరాన్ పేర్కొంది. ఒకవేళ అణు విస్ఫోటం జరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. రేడియో ధార్మికత (Radioactive particles) ప్రభావం నుంచి రక్షించుకునేందుకు బేస్మెంట్ ఉన్న పటిష్ట నిర్మాణాల్లోకి తరలివెళ్లాలని పేర్కొంది. బయట నుంచి ఇళ్లలోకి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసివేయాలని పేర్కొంది. ఏసీలనూ నిలిపివేయాలని తెలిపింది. దాడి తర్వాత దాదాపు 24 గంటల పాటు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, బాటిళ్లలో నీరు, ప్యాకింగ్ చేసిన ఆహారం వినియోగించాలని పేర్కొంది. వాహనాలల్లో మాత్రం తలదాచుకోవద్దని స్పష్టం…
న్యూయార్క్: ఇరాన్‌కు చెందిన ఖాసిమ్ దీవి(Qeshm Island)పై సోమవారం అమెరికా అటాక్ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. టెహ్రాన్‌తో శాంతి ప్రతిపాదన కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో ప్రగతి ఉన్నా..దాడులు జరిగినట్లు ఓ అధికారి చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో ఉన్న అతిపెద్ద దీవి అది.అత్యంత రహస్యంగా దాడి ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. ఖాసిం దీవిలో అయిదు ప్రదేశాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు ఇరానీ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొన్నది. రెండు విమానాలు గాలిలో ఎగురుతూ కనిపించినట్లు స్థానికులు చెప్పారు.
తాజా దాడి గురించి అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే చాలా వారాల నుంచే స్వల్ప స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆ కథనంలో తెలిపారు. మరో వైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యంత ఎన్నికల వేళ తాజా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. అయితే టెహ్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఖాసిం దీవితో పాటు బందర్ లెంగే దీవిపై కూడా దాడి జరిగినట్లు చెబుతున్నారు.
Iran-USA | ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్‌పై మళ్లీ దాడులు జరగొచ్చన్న సంకేతాలు.. ఇరాన్-అమెరికా మధ్య చర్చల్లో పురోగతి అంటూ వార్తలు.. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌లోని ఖేష్మ్ ఐలాండ్ (Qeshm Island) మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఐదు చోట్ల బాంబుల వర్షం కురిసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కొన్ని వారాల విరామం తర్వాత మళ్లీ పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం కనిపించింది.
ఖేష్మ్తో పాటు హర్మూజ్ జలసంధి సమీపంలోని బందర్ లెంగే నగరంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఖేష్మ్ ద్వీపం మీదుగా రెండు విమానాలు ఎగురుతుండటాన్ని స్థానికులు చూసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. హర్మూజ్ (Strait of Hormuz) సమీపంలో ఎంక్యూ-9 సహా మరో రెండు డ్రోన్లను ఐఆర్జీసీ కూల్చేసింది. అలాగే జలసంధిలో రాకపోకలు సాగిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించినట్లు తెలుస్తోంది. ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై ఈ దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.