Eenadu ·
MI - SKY: సీటు బెల్ట్ బిగించి పెట్టుకోండి.. రోహిత్ కెప్టెన్సీపై సూర్య పోస్టు
Rohit Sharma | ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తన కొత్త సారథిని ప్రకటించింది. హార్దిక్ పాండ్య ఫ్రాంచైజీని వదిలి వెళ్లడంతో కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయికి ఐదు కప్పులను అందించిన నాయకుడిగా మరోసారి రోహిత్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ముంబయి జట్టు సహచరుడు సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టాడు. ‘‘లీడర్.. బ్రదర్.. మెంటార్.. ముంబయి ఫ్యాన్స్ మీ సీట్ బెల్టులను బిగించుకోండి’ అనే వ్యాఖ్యను జోడించాడు.
రోహిత్ శర్మకు జస్ప్రీత్ బుమ్రాను డిప్యూటీగా నియమించాలని ముంబయి ఇండియన్స్ భావించిందట. కానీ, స్టార్ పేసర్ మాత్రం విముఖత ప్రదర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. తొలి నుంచీ కెప్టెన్ రేసులో సూర్యకుమార్, బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. కానీ, మరోసారి రోహిత్‌కే సారథ్య బాధ్యతలను అప్పగిస్తూ ముంబయి నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్‌గా తిలక్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.