We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధించాలని యోచిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తూ, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు.
బెంగళూరు నగరంలోని హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. నగరవ్యాప్తంగా స్మోకింగ్ ఫ్రీ జోన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం పరిశీలిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై కఠిన నియంత్రణలు ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ ఈ ప్రతిపాదనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాతే నిషేధం అమలుపై కన్నడ ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు హోటళ్లు, ఐటీ కంపెనీల క్యాంపస్‌లలో ధూమపానం కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. అయితే ఈ గదుల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించకుండా ఆపలేమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ హత్యపై సంచలన ఆరోపణలు చేశారు, తన తండ్రిని చంపడానికే కావాలని భద్రత తొలగించారని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ నేపథ్యంతో గాంధీ కుటుంబం 23 నిమిషాల ప్రత్యేక వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ కీలక వెబ్సైట్లు, డిజిటల్ పోర్టళ్లకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో ఐటీ, సైబర్ సెక్యూరిటీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆధునిక ఏఐ బాట్ల సాయంతో గుర్తుతెలియని ముఠాలు ప్రభుత్వ సర్వర్లు, పోర్టళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అన్ని శాఖలకు సైబర్ భద్రతపై హెచ్చరికలు జారీ చేశారు.
కీలక పోర్టళ్లలో ఫైర్వాల్లను పటిష్ఠం చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ముఖ్యంగా భూభారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, టీజీఐఐసీ, జీఎస్టీ, ఫైనాన్స్, ఈ-ఆఫీస్ వంటి కీలక వ్యవస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఇప్పటికే భూభారతి పోర్టల్‌లో కొన్ని సేవలపై ఆంక్షలు విధించగా, ఈ-ఆఫీస్‌లోనూ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పౌరుల డేటా, ఆర్థిక లావాదేవీలు, భూముల రికార్డుల భద్రత కోసం సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి శాఖ నోడల్ అధికారి స్థాయిలో భద్రతా తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు.
Entertainment — not analysed for political framing
డిసెంబరులో ‘కింగ్ 100’ హంగామాకి రంగం సిద్ధమైంది. మరో ముప్పై రోజుల్లో అంటూ చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. నాగార్జున అక్కినేని కథానాయకుడిగా... రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘కింగ్ 100’. టబు, అశోక్ సెల్వన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని చేసుకొంటోంది. త్వరలోనే ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. మంగళవారం చిత్రబృందం ఓ ప్రత్యేకమైన పోస్టర్ని విడుదల చేసింది. డిసెంబరు 24న ప్రేక్షకుల ముం దుకు రానున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: రాజా మహదేవన్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ చిత్రం ' వారణాసి '. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి సినిమా భారీ సెట్స్ కనిపించాయంటూ నెటిజన్లు షేర్ చేస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ చుట్టూ వివాదాలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జాన్వీకపూర్ ను చూపించిన విధానం, ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై దర్శకుడు సైతం స్పందించి క్షమాణణలు కూడా చెప్పారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఈ వివాదంపై సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రుతిహాసన్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ గా తన కొత్త సినిమా 'ఆకాశంలో ఒక తార' ప్రమోషన్లలో బిజీగా ఉన్న శ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ 'పెద్ది'సినిమాలోని పాట వివాదం, జాన్వీ కపూర్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి " మరొకరి అనుభవం గురించి నేను మాట్లాడటం సరైనది కాదు. వాళ్ల పరిస్థితి, వాళ్లకు ఎదురైన అనుభవాలు నాకు పూర్తిగా తెలియవు. అలాగే నా తరఫున కూడా మరొకరు మాట్లాడలేరు. అందుకే ఆ వివాదంలోకి వెళ్లదలుచుకోలేదు" అని శ్రుతి సమాధానం ఇచ్చారు.
ఇరాన్ లో మహిళల స్వేచ్చ, కళాకారుల హక్కులపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హిజాబ్ లేకుండా పాట పాడటమే నేరంగా పరిగణించారు అక్కడి అధికారులు. పరుస్తూ అహ్మదీపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెతో పాటు సంగీత బృందానికి చెందిన సోహైల్ ఫఘీహ్ నసిరి, అమీన్ తహేరి, అమీర్ అలీ పిర్నియా, మొహ్సెన్ లష్కరీలకు కూడా 74 చొప్పున కొరడా దెబ్బలు విధించారు. నవంబర్ 23న ఖోమ్ నగరంలోని శిక్ష అమలు విభాగంలో ఈ శిక్షను అమలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది మోస్తఫా నిలీ వెల్లడించారు.
2024 డిసెంబర్ 11న పరస్తూ అహ్మదీ తన యూట్యూబ్ ఛానల్లో ఓ ప్రత్యేక సంగీత ప్రదర్శన వీడియోను విడుదల చేశారు. ఖోమ్ సమీపంలోని చారిత్రక దైర్ గచిన్ కారవాన్సెరాయ్లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఆమె ఎలాంటి హిజాబ్ ధరించకుండా.. పురుష సంగీతకారులతో కలిసి పాటలు పాడారు. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన ఈ ప్రదర్శనకు 'ఇమాజినరీ కాన్సర్ట్' అనే పేరు పెట్టారు. ఈ వీడియోకు లక్షలాది మంది నుంచి స్పందన రావడంతో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చ మొదలైంది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం విడుదల అందించింది. 2027 జనవరి నెలలో శ్రీవారి సేవ చేయాలనుకునే వారి కోసం ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించనుంది. నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో సేవ చేయాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.
జనరల్ శ్రీవారి సేవకు బుక్ చేసుకున్నవారు తమ సేవ ప్రారంభమయ్యే రోజే తిరుమల లేదా తిరుపతిలో రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవకు బుక్ చేసుకున్నవారు మాత్రం తమ సేవ తేదీకి ఒక రోజు ముందుగానే తిరుమలకు వెళ్లాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అక్కడ రిపోర్ట్ చేయాలి.
ఐపీఎల్ 2027కు పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌లు.. బౌలింగ్, ఫీల్డింగ్ బాధ్యతలు వీరికే!
Not analysed for framing
Punjab Kings: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ (PBKS) తమ కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేస్తోంది. టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే (Paras Mhambrey) ను బౌలింగ్ కోచ్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ సిబ్బంది రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించేందుకు పంజాబ్ సిద్ధమైనట్లు క్రిక్ఇన్ఫో (Cricinfo) నివేదించింది. గత నెలలో మాజీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు జేమ్స్ హోప్స్ (James Hopes), బ్రాడ్ హడిన్ (Brad Haddin) పంజాబ్ జట్టు నుంచి వైదొలగడంతో, వారి స్థానాల్లో వీరిని తీసుకుంటున్నారు.
‘‘మా నాన్నను చంపడానికే కావాలని భద్రత తొలగించారు.. ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు. ఇదంతా పక్కా కుట్ర!’’ అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వెనుక నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్్ణ ఆత్మకథ నేపథ్యంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూర్చొని మాట్లాడుకున్న 23 నిమిషాల ప్రత్యేక వీడియోను మంగళవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బిహార్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, బండరాళ్లతో దాడి జరిగిందని…
ఈ వీడియోలో గాంధీ కుటుంబం పలు వ్యక్తిగత, రాజకీయ అనుభవాలను పంచుకుంది. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ ఓటమి చెందిన రోజుల్లో పాఠశాలలో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రియాంక గాంధీ గుర్తుచేసుకున్నారు. స్కూల్లో ఓ బాలుడు వచ్చి ఁమీ బాబాయ్ దొంగ.. జైల్లో ఉన్నాడుఁ అని అవమానించగా, తాను గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్లు ఆమె తెలిపారు. తామిద్దరి స్వభావాలు భిన్నమని, తాను నిబంధనలు పాటిస్తే రాహుల్ తనకిష్టమైనట్లు ఉండేవాడని ప్రియాంక చెప్పారు.2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు తాను ప్రధాని పదవిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో సోనియా గాంధీ స్పష్టత ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పదవిని పట్టుకుని వేలాడేందుకు ఎవరైనా కారణాలు…
బ్యాట్స్‌మెన్‌కు షాక్.. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్ తరహా బ్యాట్ చెకింగ్
Not analysed for framing
ICC New Rules: టీ20 క్రికెట్లో బ్యాటర్లు అలవోకగా బంతిని బౌండరీ అవతలికి తరలిస్తుండటం, ప్రతి సీజన్లో సిక్సర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా మందపాటి, పెద్ద సైజు బ్యాట్లను వాడి అదనపు ప్రయోజనం పొందకుండా అడ్డుకునేందుకు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆకస్మిక బ్యాట్ తనిఖీలు (Surprise Bat Checks) నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఇకపై బ్యాటర్లు క్రీజులోకి వెళ్లే ముందే అంపైర్ల దగ్గర ఉండే ప్రత్యేక మెజరింగ్ గేజ్ (Measuring Gauge) ద్వారా తమ బ్యాట్లను పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
The Breaking News | డిసెంబర్ 11న ‘ది బ్రేకింగ్ న్యూస్’ రిలీజ్.. ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన మురళీ మోహన్, అనన్య నాగళ్ల
Entertainment — not analysed for political framing
The Breaking News | తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు, సమాజంలోని ఆసక్తికర అంశాలను తెరపై చూపించే కథలకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రపంచంలోని తెరవెనుక పరిణామాలను ఆసక్తికరంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైన చిత్రం ‘ది బ్రేకింగ్ న్యూస్’. మురళీ మోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ సంయుక్తంగా నిర్మించిన ‘ది బ్రేకింగ్ న్యూస్’ చిత్రాన్ని డిసెంబర్ 11, 2026న ప్రేక్షకుల…
ఈ సినిమా ట్రైలర్‌ను హీరో సుమంత్ విడుదల చేశారు. ట్రైలర్లో కనిపించిన ఉత్కంఠభరిత సన్నివేశాలు, కథలోని మిస్టరీ, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వార్తా ప్రపంచంలో జరిగే పరిణామాలు, నిజం కోసం చేసే అన్వేషణ నేపథ్యంలో సినిమా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. తాజాగా ట్రైలర్ విడుదల కావడంతో సినిమా ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.