We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Gold and silver prices rose on November 1 and remained stable on November 2, 2026, according to market data. Retail rates for 24-carat and 22-carat gold, as well as silver, are reported across major cities in the Telugu states.
గత నెల చివరి వారంలో అనూహ్యంగా పతనం అయిన బంగారం, వెండి రేట్లు మళ్లీ నవంబర్ మాసంలో తిరిగి పుంజుకుంటున్నాయి. దీంతో దీపావళికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారికి రేట్లు భారంగా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రస్తుతం షాపింగ్ చేయాలని అనుకుంటున్నట్లయితే సోమవారం రోజున తమ సమీప నగరాల్లో మారిన రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
నవంబర్ 2న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు నవంబర్ 1 కంటే రూ.49 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 937గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 775గా కొనసాగుతోంది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో రేపు (నవంబర్ 2, 2026) బీజేపీ పాదయాత్ర, హోంమంత్రి అమిత్ షా పర్యటన ఉండటంతో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు బీజేపీ పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే.
* పాదయాత్ర నేపథ్యంలో పలు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు * బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు * ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లింపు * జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లింపు * లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతి నిరాకరణ.. హిమాయత్‌నగర్ వైపు మళ్లింపు * హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లింపు * బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బోగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లోనూ…
హైదరాబాద్, వెలుగు: నగరంలో తాగునీటి వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఆదివారం నుంచి ‘గ్రీన్ ట్యాంకర్ల’ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. సచివాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలు, గార్డెనింగ్, క్లీనింగ్ తదితర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా నగరానికి అదనంగా 40 ఎంజీడీల నీటిని అందించే ప్రాజెక్టును నవంబర్ 15 నాటికి పూర్తి చేస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.
వచ్చే ఏడాది ఆగస్టు వరకు విలీన పట్టణ స్థానిక సంస్థలకు బల్క్ వాటర్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. ఎస్టీపీల వద్ద ప్రత్యేక ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి 10 వేల, 20 వేల, 30 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. తొలి దశలో 300 నుంచి 400 ట్యాంకర్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 155313, 040-23300114 నంబర్లతో పాటు ప్రత్యేక యాప్, వెబ్సైట్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చు.
వైభవ్‌ను ఆడిస్తారా? ఇవాళ(నవంబర్ 1)న్యూజిలాండ్ తో ఐదో టీ20 మ్యాచ్
Not analysed for framing
హామిల్టన్: నాలుగో టీ20ల్లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో ఐదో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో కొన్ని వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీమ్ కూర్పుపై నమ్మకంతో ఉన్నప్పటికీ నాలుగో మ్యాచ్ ఓటమి మేనేజ్మెంట్ ఆలోచనలను మార్చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా 3–1 ఆధిక్యంలో ఉన్నా.. చివరి మ్యాచ్‌లో ఓటమితో సిరీస్‌ను ముగించాలని ఇండియా అసలు కోరుకోవడం…
ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో 67, 14, 18, 4 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో కొద్దిగా విరామం ఇస్తే మళ్లీ గాడిలో పడతాడని భావిస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాగున్నా.. వ్యక్తిగత పెర్ఫామెన్స్ ఏమాత్రం బాగా లేదు. టీ20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ సాధించిన తర్వాత ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 40, 1, 16, 22, 42, 7, 5, 22 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ప్రభావం చూపించాల్సిన ఒత్తిడి శ్రేయస్‌పై ఉంది.…
RC17 Movie: నవంబర్ 1న RC17 గ్రాండ్ లాంచ్.. రామ్ చరణ్ – సుకుమార్ కాంబోపై తబితా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Not analysed for framing
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న RC17పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 1న హైదరాబాద్‌లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది.
మరోవైపు సినిమా ప్రారంభానికి ముందే సుకుమార్ భార్య తబితా సుకుమార్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఎంతో కష్టపడ్డారని, కథ రచనలో ఎన్నో గంటలు శ్రమించారని ఆమె పేర్కొన్నారు. రామ్ చరణ్, సుకుమార్ లాంటి అభిమానులు ఇష్టపడే కాంబినేషన్ మరోసారి కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. గత సినిమాల షూటింగ్స్, ప్రమోషన్లకు సంబంధించిన వీడియోలతో రూపొందించిన ప్రత్యేక కొలాజ్‌ను కూడా ఆమె షేర్ చేశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.