We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Prime Minister Narendra Modi inaugurated the RBI greenfield data center in Jatni, near Bhubaneswar, Odisha, stating that the state's development goals will be realized under the 'double engine' government.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ‘అర్నబ్’ తుపాను గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా.. మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడనుంది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశా యువత కన్న కలలు డబుల్ ఇంజిన్ పాలనలో సాకారమవుతాయని, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజ వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ చేరువలోని జట్నీ ఆర్బీఐ గ్రీన్ఫీల్డ్ డేటా కేంద్రం ప్రారంభించిన మోదీ మాట్లాడుతూ రాష్ట్రం ఐటీ, ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో విజయాలు అందుకోనుందని, ‘వుయ్ విల్ డూ ఇట్’ (మేం దీన్ని సాధిస్తాం) అన్న దానికి కట్టుబడి ఉన్నామని, ఖనిజ సంపద సద్వినియోగం చేస్తామన్నారు. ఒడిశా ఆర్బీఐ డేటా కేంద్రం జగన్నాథుడు ప్రసాదించిన వరమని, ఇది దేశ ఆర్థికరంగాన్ని బలోపేతం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గవర్నరు…
The India Meteorological Department (IMD) warned that a severe cyclonic storm is expected to hit the coasts of Andhra Pradesh and Odisha around October 28.
Cyclonic storm : ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర తుపాను ముప్పు పొంచివున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారి తీరంవైపు దూసుకొస్తోందని, ఈ తుపాను అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఏపీకి హెచ్చరిక జారీచేసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీచేశారు. ఒడిశా సర్కారు కూడా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నది. తీరం వెంబడి విపత్తు నిర్వహణ సిబ్బందిని భారీగా మోహరించింది. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది.
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజల పాటు ఒడిశాలో పర్యటించాల్సి ఉన్నది. అయితే ఆ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ఏర్పడే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా పడింది. (President Droupadi Murmu) అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కావాల్సిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా పర్యటన వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ‘ప్రతికూల వాతావరణ సూచనలు, భద్రతా జాగ్రత్తల దృష్ట్యా రాష్ట్రపతి పర్యటనను వాయిదా వేశాం’ అని ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చెందిన ఒక అధికారి పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 28, 29 తేదీల్లో ఒడిశాలోని రైరంగపూర్తో పాటు సొంత జిల్లా అయిన మయూర్భంజ్ను సందర్శించాల్సి ఉన్నది. అయితే మయూర్భంజ్ జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రపతి పర్యటన రద్దు కాలేదు. కేవలం తేదీలు మాత్రమే మారాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 4, 5 తేదీల్లో మయూర్భంజ్లో పర్యటిస్తారని ఆ అధికారి వివరించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.