We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
An outlet-by-outlet comparison appears once 3 analysed articles from 2 outlets are in.
Newest first
Eenadu ·
Summer Holidays movie ott: ఓటీటీలోకి ‘సమ్మర్ హాలీడేస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Entertainment — not analysed for political framing
ఇంటర్నెట్ డెస్క్: రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో.. శ్రీకర్ నయన్ తెరకెక్కించిన చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’ (Summer Holidays). ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది (Summer Holidays). ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. డిసెంబరు 4 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది.
పట్నంలో చదువుకుంటున్న కుర్రాడు ఆర్వీ (అరుణ్‌దేవ్). ఎప్పుడూ మార్కుల గురించే అడుగుతూ.. ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తుంటాడు తండ్రి (హర్షవర్ధన్). ఆర్వీకి మాత్రం క్రికెట్ అంటే ఆసక్తి. ఆ విషయాన్నీ ధైర్యంగా తండ్రితో చెప్పలేని బలహీనత తనది. సంతోషం అన్నదే ఎరుగడు. ఇంతలో వేసవి సెలవులు రావడంతో తల్లి (వాసుకి)తో పాటు తోటవారి పాలెంలోని అమ్మమ్మ (జయసుధ) ఇంటికి వెళతాడు. అక్కడే కేవీ (రోహన్ రాయ్) పరిచయం అవుతాడు. భిన్న ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరూ తక్కువ సమయంలోనే మంచి స్నేహితులు అవుతారు. కేవీ పైకి నవ్వుతూ, సరదాగా కనిపిస్తున్నా.. అతని చుట్టూ సమస్యలే. తాగుడుకు బానిసై…
Today OTT Movies: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన 17 కొత్త సినిమాలు.. పూర్తి లిస్టు ఇదే
Entertainment — not analysed for political framing
నవంబర్ 27 OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వారం కూడా పలు ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు వచ్చేశాయి. క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్, ఆధ్యాత్మిక కథాంశాలతో రూపొందిన సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. మరి నవంబర్ 27న ఏయే సినిమాలు విడుదలయ్యాయి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి భాషలు, జోనర్లు ఏమిటో చూద్దాం.
1. ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 (AK47) – క్రైమ్, కామెడీ- నెట్‌ఫ్లిక్స్
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Entertainment — not analysed for political framing
OTT Movies | ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నట్లుగానే ఓటీటీల్లోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి. అందులో విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’, చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’, బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ రోజు స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల లిస్ట్ చూస్తే..
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. నారా రోహిత్, సత్య, రఘుబాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంపికగా నిలవనుంది.
Entertainment — not analysed for political framing
Aadarsha Kutumbam | టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ఆయన ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటారు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా కుటుంబ కథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (AK47). భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విశేషమేమిటంటే తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఐదు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు, ఫ్యామిలీ…
OTT New Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి 8 క్రేజీ సినిమాలు..
Entertainment — not analysed for political framing
వీకెండ్ రేపటి నుంచి మొదలవ్వనుంది.. ఇక ఎంచక్కా ఇంట్లోనే హాయిగా కూర్చొని కొత్త సినిమాలు చూడాలనుకునే ఓటీటీ ప్రేక్షకులకు ఈ శుక్రవారం అదిరిపోయే ట్రీట్ సిద్ధమైంది. నవంబర్ 27న (శుక్రవారం) పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విభిన్న జానర్లకు చెందిన 8 సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. యాక్షన్ కామెడీ, మిస్టరీ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామా.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, మనోరమ మ్యాక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమాలతో ఈ వీకెండ్ వినోదానికి కొదవ ఉండదనే చెప్పాలి. మరి ఆ ఐదు సినిమాలేంటి? వాటి స్టోరీ బ్యాక్ డ్రాప్…
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47’ నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ సామాన్య కుటుంబానికి అనుకోకుండా రూ.100 కోట్ల లాటరీ తగలడం.. ఆ తర్వాత ఖరీదైన విల్లాలోకి మారిన ఆ కుటుంబానికి ఎదురైన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.