V6 Velugu ·
Shruti Haasan: జాన్వీ కపూర్ వివాదంపై శ్రుతిహాసన్ షాకింగ్ రియాక్షన్.. 'పెద్ది' పాట గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ చుట్టూ వివాదాలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జాన్వీకపూర్ ను చూపించిన విధానం, ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై దర్శకుడు సైతం స్పందించి క్షమాణణలు కూడా చెప్పారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఈ వివాదంపై సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రుతిహాసన్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ గా తన కొత్త సినిమా 'ఆకాశంలో ఒక తార' ప్రమోషన్లలో బిజీగా ఉన్న శ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ 'పెద్ది'సినిమాలోని పాట వివాదం, జాన్వీ కపూర్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి " మరొకరి అనుభవం గురించి నేను మాట్లాడటం సరైనది కాదు. వాళ్ల పరిస్థితి, వాళ్లకు ఎదురైన అనుభవాలు నాకు పూర్తిగా తెలియవు. అలాగే నా తరఫున కూడా మరొకరు మాట్లాడలేరు. అందుకే ఆ వివాదంలోకి వెళ్లదలుచుకోలేదు" అని శ్రుతి సమాధానం ఇచ్చారు.