We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Deputy Chief Minister Bhatti Vikramarka urged banks to support farmers facing drought and financial difficulties by restructuring crop loans and providing new Rabi loans. He made this appeal during a State Level Bankers' Committee meeting in Hyderabad.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదురొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార బ్యాంకులను కోరారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల పంట రుణాలను పునర్వ్యవస్థీకరించడం, రీషెడ్యూల్ చేయడంతోపాటు రబీకి అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో భట్టి మాట్లాడారు.
Deputy Chief Minister Bhatti Vikramarka directed banks to reschedule crop loans and provide timely credit to farmers facing drought conditions in Telangana.
అయిజ, నవంబర్ 10 : వాడుముఖం పట్టిన పంటలను కాపాడుకునేందుకు రైతులు మురుగునీటిని తరలిస్తున్నారు. నెల రోజులుగా 20 మందికిపైగా రైతులు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని పెద్దవాగు నుంచి మురుగు నీటిని తీసుకెళ్తున్నారు. తాము ఆర్టీఏ అధికారులం అంటూ పరిచయం చేసుకున్న వారు మురుగు నీటిని తరలిస్తున్న ట్యాంకర్లను నిలిపివేశారు. అనుమతి లేకుండా నీటిని తరలిస్తే రూ.1.50 లక్షల జరిమానా విధిస్తామని రైతులను హెచ్చరించారు.
ఇప్పటికే పంటలను కాపాడుకునేందుకు రూ.లక్షకుపైగా కిరాయిలు భరించి ట్యాంకర్లలో నీటిని తరలిస్తున్నామని, జరిమానా విధిస్తే తాము ఎక్కడి నుంచి పైసలు తెచ్చి కట్టాలని రైతులు ఆవేదన చెందారు. తాము తీవ్రంగా నష్టపోతామని.. కాళ్లు మొక్కుతాం.. తమను విడిచిపెట్టాలని వేడుకున్నారు. అయినా కనికరించని అధికారులు ఒక్కో రైతు నుంచి రూ.5 వేల చొప్పున.. ఇద్దరి నుంచి రూ.10 వేలు వసూలు చేశారని రైతులు పేర్కొన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.