Eenadu ·
సారపాకలో పోలీసుల కార్డెన్ సెర్చ్
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక పారిశ్రామిక ప్రాంతంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం నిర్బంధ తనిఖీలు (కార్డెన్ సెర్చ్) నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సతీశ్, ఎస్సైలు ప్రసాద్, నాగభిక్షం, రామమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.