We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. వీడియోలు వైరల్ కావాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన స్టాంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఓ సరదా వీడియో షూటింగ్ చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. టిక్‌టాక్ వీడియో కోసం బోనులో ఉన్న ఆడపులిని బయటకు తీసుకురాగా.. అది ఓ 19 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చంపేసింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో చోటుచేసుకుంది.
టిక్‌టాక్ వీడియో కోసం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగింది. నోమన్ హసన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ టిక్‌టాక్ వీడియో చిత్రీకరించేందుకు వచ్చాడు. ఇందుకోసం అక్కడ పెంచుతున్న ఆడపులిని దాని బోను నుంచి బయటకు తీసుకొచ్చారు.
A Pakistani TikTok influencer named Noman Hassan filmed a video with a tiger at a private wildlife farm in Lahore, during which a worker named Talha was fatally attacked.
అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రెండు రోజులుగా తెలంగాణ - ఏపీ సరిహద్దులో సంచరించి కలకలం రేపిన పులి ప్రస్తుతం అశ్వారావుపేట అడవుల్లోకి చేరింది. గురువారం ఉదయం మండలంలోని గుమ్మడవల్లి బీట్ పరిధిలో బచ్చువారిగూడెం సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గతంలో పులి మెడలో ఏర్పాటు చేసిన ట్రాకర్ చూపించినట్లు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం సెక్షన్ ఆఫీసర్ పెరుమాళ్లు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఉదయం నుంచి మళ్లీ ట్రాకర్‌కు సిగ్నల్ రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అశ్వారావుపేట మండల అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయంపై అశ్వారావుపేట ఎఫ్ఆర్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. సరిహద్దులో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ప్రేమికుడి కోసం కాంక్రీట్ గోడల్ని బద్దలుకొట్టుకుని మరీ తప్పించుకుపోయిన పులి కథ ఇది. పశ్చిమ బెంగాల్లో పులుల సంతతిని పెంచడంలో భాగంగా అధికారులు అక్టోబర్‌లో బిహార్ నుంచి మూడేళ్ల వయసున్న ఆడపులి ‘రాణి’ని తీసుకొచ్చారు. దానిని బుక్సా టైగర్ రిజర్వ్‌లోని ఓ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ఆ పులి అక్కడి నుంచి తప్పించుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఎన్‌క్లోజర్ కంచె కింద నాలుగు అడుగుల లోతున కాంక్రీట్ పునాది ఉన్నప్పటికీ, దాని కింద నుంచి సొరంగం తవ్వుకుని మరీ పులి వెళ్లిపోయింది. దీంతో రాణిని వెతకడం కోసం దాదాపు 60 మంది సిబ్బందితో పాటు మూడు కుంకీ ఏనుగులు కూడా రంగంలోకి దిగాయి. రాణి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్ల వర్షం కురిపించారు. సోమవారం (నవంబర్ 9) లగచర్లలో నిర్వహించిన రైతన్నతో ఆత్మీయ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విదేశీ కన్సల్టెంట్స్ను పెట్టుకుని కేటీఆర్ నాకు పోటీగా మారాలనుకుంటున్నాడు. ఇందుకోసం నాలాగా గడ్డం పెంచుకోవాలని ఆయనకు వాళ్లు సలహా ఇచ్చారట. అందుకే కేటీఆర్ గడ్డం పెంచుతుండు. కానీ ఎన్ని వేషాలు వేసినా పులి పులే నక్క నక్కే. కేటీఆర్ గడ్డం పెంచినా.. పది జన్మలు ఎత్తినా ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేరు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం, కార్యకర్తల అండ, నమ్మినవారికి ప్రాణమిచ్చే త్యాగం ఉండాలి. నమ్మినవాళ్లనే నట్టేట ముంచే…
మక్తల్-నారాయణపేట్-కొడంగల్ పథకాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రాజెక్ట్ పనులు చేపడుతుంటే మీకు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు. 2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలతో కొడంగల్ భూములు తడుపుతామన్నారు. కొడంగల్ గడ్డమీద పచ్చని పంటలు పండిస్తామని.. ఇది పోలేపల్లి ఎల్లమ్మ మీద ఆన అని శపథం చేశారు. ఎవరూ అడ్డొచ్చినా కృష్ణా నదిలో ముంచైనా కృష్ణా జలాలను తీసుకొస్తామని తేల్చిచెప్పారు.
పులిహార అంటే చాలు జనాలు ప్లేట్లను ఖాళీగా ఉంచుకుంటారు. ఎప్పుడూ రెగ్యులర్ గా చేసే చింతపండు.. నిమ్మకాయ పులిహార అంటే బోర్ కొడుతుంది కదా..! మరి కార్తీకమాసంలో స్పెషల్ గావచ్చే ఉసిరికాయలతో పులిహార చేస్తే లొట్టలు వేస్తూ లాగిస్తారు. మరి ఉసిరి పులిహారను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ..!
కార్తీక మాసం అనగానే వనభోజనాలు ఉసిరి చెట్టుకు పూజ చేయడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చేస్తుంటాం. అలాంటి వాటిలో ఉసిరాకాయతో పులిహారను వడ్డించారంటే ప్రతి ఏడాది వనభోజనాలకు మీ దగ్గరకు రావాల్సిందే..!
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాంక్రీటు ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఓ ఆడపులి (Tigress).. అత్యంత చాకచక్యంగా సొరంగం తవ్వుకుని అక్కడి నుంచి పారిపోవడం చూసి ఫారెస్ట్ అధికారులు షాకయ్యారు. మరో విషయమేంటంటే.. ఆ పులి ఇలా రిజర్వ్ ప్రాంతం నుంచి తప్పించుకోవడం (Tigress Digs Tunnel To Escape) రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో పులుల సంతతిని పెంచడంలో భాగంగా ఇటీవల బిహార్ నుంచి ఓ మూడేళ్ల ఆడపులిని తీసుకొచ్చారు. రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) జాతికి చెందిన ఈ ఆడపులి ‘రాణి’ని అక్టోబరు 5న బుక్సా టైగర్ రిజర్వ్‌లో విడిచిపెట్టారు. అయితే, రెండువారాలకే ఈ పులి టైగర్ రిజర్వ్ నుంచి పారిపోయింది. దాదాపు 13 రోజుల పాటు పులి కోసం తీవ్ర గాలింపు చేపట్టిన అటవీశాఖ అధికారులు.. నవంబరు 3న అస్సాంలోని రైమోనా టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని ఓ నది వద్ద దాన్ని గుర్తించారు. ఆ మరుసటి రోజు తీసుకొచ్చి బుక్సాలోని 25-మైల్ టవర్ వద్ద ఎన్‌క్లోజర్‌లో బంధించారు.
Viral News : సాధారణంగా జైళ్లలో ఉన్న ఖైదీలు, బందీలుగా ఆపాయంలో ఉన్నవాళ్లు సొరంగాలు తవ్వుకుని తప్పించుకున్న ఘటనల గురించి విన్నాం. కానీ ఇటీవల ఓ పెద్దపులి (Tiger) తెలివిగా ఎన్‌క్లోజర్ (Encloser) నుంచి సొరంగం తవ్వుకుని తప్పించుకుంది. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బుక్సా టైగర్ రిజర్వ్ (Buxa Tiger Reserve) లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎన్‌క్లోజర్ పునాది కింద సొరంగం తవ్వి మూడేళ్ల ఆడపులి చాకచక్యంగా తప్పించుకుంది.
అసోం నుంచి తిరిగి తీసుకొచ్చిన నాలుగు రోజులకే ఈ ఘటన జరగడంతో అటవీ అధికారులు విస్మయానికి గురయ్యారు. బెంగాల్లో పులుల సంఖ్యను పెంచే ప్రాజెక్టులో భాగంగా బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ నుంచి ‘టీ-138’ అనే ఆడపులిని తీసుకొచ్చారు. అక్టోబర్ 2న బుక్సాలోని 25వ మైలువద్ద ఉన్న 2.2 హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో దీనిని విడిచిపెట్టగా.. అక్టోబర్ 4 ననే బయటపడి సంకోష్ నది దాటి అసోంలోని రైమోనా ప్రాంతానికి వెళ్లిపోయింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.