We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
A video of a family from Surat cooking in a 3AC train compartment on November 10, 2026, went viral on X, sparking widespread social media trolling and debate. While some viewed the incident as comedy, others criticized the lack of respect for fellow passengers.
విమానాశ్రయంలో బంతి భోజనం చేయడం.. విమానాన్ని ఆర్టీసీ బస్సులా భావించడం.. చివరికి రైలు భోగీని వివాహాది కార్యాలకు వాడుకోడం.. మన ఇండియన్స్ కే సాధ్యమేమో. ఇలాంటి ఘటనలు ఎన్నో వైరల్ అయ్యాయి. లేటెస్టుగా ఒక గుజరాత్ ఫ్యామిలీ రైలును వంటగదిలా మార్చుకుని.. వంటలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. 2026 నవంబర్ 10వ తేదీన X వేదికగా షేర్ అయిన ఈ వీడియోలో, సూరత్‌కు చెందిన ఒక కుటుంబం 3AC కంపార్ట్మెంట్లో వంట చేస్తున్న వీడియో బయటికొచ్చింది. మిడిల్ బెర్త్, పక్కనున్న సీట్లపై న్యూస్‌పేపర్లు పరిచి, శాండ్విచ్లు తయారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రైలు పట్టాలు తప్పే ముందు భయంకరమైన క్షణాలు.. బ్రేకులు వేస్తూ లోకో పైలట్ అరిచిన వీడియో వైరల్!
Not analysed for framing
అస్సాంలో కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 13125) పట్టాలు తప్పిన ఘటనలో షాకింగ్ వీడియో వైరలవుతోంది. కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాలోని డిగారు రైల్వే స్టేషన్ దగ్గర 2026 నవంబర్ 11న (బుధవారం) జరిగినలో లాస్ట్ మినట్ వీడియో బయటకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఇంజిన్‌తో పాటు ఏడు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి.
According to [PUBLISHER], Dr. Goshada Balakrishna (48), an anesthetist at Vizianagaram Government Hospital, died after falling under a train near Cheepurupalli railway station on Wednesday morning.
On November 10, 2026, a goods train carrying a large number of excavators passed through Bibinagar railway station in the Yadadri Bhuvanagiri district of Telangana, heading towards Bengaluru.
Two passenger trains collided near Giza in Egypt, resulting in seven deaths and over 100 injuries. The Egyptian president ordered a swift investigation into the accident, while demands grew for the transport minister to resign.
ఉదయం సుమారు 6:54 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మిజోరాంలోని సైరాంగ్ నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న ఈ రైలు డిగారు స్టేషన్లో మరో రైలుకు క్సాస్ చేయాల్సిన చోట ఆపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేగం అదుపు చేయలేక పట్టాలు తప్పినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) తెలిపింది.
చీపురుపల్లి: చీపురుపల్లి రైల్వే స్టేషన్ దాటాక విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో మత్తు డాక్టరుగా పనిచేస్తున్న గోషాడ బాలకృష్ణ (48) బుధవారం తెల్లవారుజామున రైలు కిందపడి మృతి చెందారు. విజయనగరంలో కుటుంబంతో ఉంటున్న ఆయన తెల్లవారుజామున కేసు ఉందని చెప్పి ఇంటి నుంచి కారులో బయలు వచ్చారు. చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శవమై తేలారు. దీనికి సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించామని, ప్రాథమిక వివరాలు మేరకు అసహజ మరణంగా గుర్తించామని పలాస జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు తెలిపారు. కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసుల నుంచి సమాచారం సేకరించి కేసు నమోదు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Not analysed for framing
గౌహతి: కోల్‌కతా నుంచి సైరంగ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు(Kolkata-Sairang Express) ఇవాళ ఉదయం అస్సాంలోని గౌహతి సమీపంలో పట్టాలు తప్పింది. అయితే ఆ ఘటనకు చెందిన ఓ చిల్లింగ్ వీడియో రిలీజైంది. రైలింజిన్ క్యాబినెట్లో ఉన్న లోకో డ్రైవర్ .. ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసినా.. రైలు ఆగకుండా ముందుకు వెళ్లింది. ఆ ఘటనకు చెందిన వీడియో చిక్కింది. రైలును ఆపేందుకు ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నిస్తున్నా.. రైలింజిన్కు బ్రేక్‌లు పనిచేయలేదు. ఎయిర్ బ్రేక్స్ వేసేందుకు ఇంజిన్ లోపల డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ ఆ బ్రేక్‌లు అప్లయ్ కాలేదు. ఇంజిన్‌కు చెందిన ఎమర్జెన్సీ సిస్టమ్ పనిచేయలేదు. రైలు ఇంజిన్‌లో…
జూనియర్ డ్రైవర్ ఆ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. వేగంగా వెళ్తున్న రైలు.. సమీపంలోని బారికేడ్లను ఢీకొట్టింది. ఆ తర్వాత డిరేల్ అయ్యింది. పట్టాలు తప్పిన రైలుకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిజోరం వెళ్తున్న రైలులోని 5 బోగీలు ఇవాళ పట్టాలు తప్పాయి. కామరూప్ మెట్రో జిల్లాలోని దిగరూ రైల్వే స్టేషన్లో రైలు డిరేల్ అయ్యింది. రైలు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్లు నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే పీఆర్వో కేకే శర్మ తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (Kolkata Sairang Express) అస్సాంలోని కామ్రూప్ జిల్లాలోని డిగార్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు ఉన్న ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. దీనిపై నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ ఈ ఘటన ఉదయం 6.54 సమయంలో చోటుచేసుకొన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇప్పటికే సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి బయల్దేరారు.
గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజిన్‌తో సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గువాహటి స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్ నుంచి బయల్దేరింది. ఇది నేటి మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతున్న వేళ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పట్టాలు తప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
న్యూస్‌టుడే, డోన్ పట్టణం, నంద్యాల రైతునగరం, ఆదోని ఎస్కేడీ కాలనీ : కార్తికం వచ్చేసింది.. ‘అయ్యప్ప’లు మాలధారణ ధరించారు.. ఏటా ఉమ్మడి జిల్లాలో 25-30 వేల మంది వరకు దీక్షబూనుతారు. వీరంతా కేరళలోని శబరిమల క్షేత్రంలో దీక్ష విరమణకు వెళ్లనున్నారు.. దూర ప్రాంతం కావడంతో చాలామంది రైలు ప్రయాణానికే ఆసక్తి చూపుతుంటారు. వీరికితోడు సివిల్ దుస్తుల్లో వెళ్లేవారు అధికంగానే ఉంటున్నారు. అక్కడికి వెళ్లడానికి ఉమ్మడి జిల్లా మీదుగా నిత్యం మూడు రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో జనవరి వరకు బెర్తులు ఖాళీలు లేవు. ఇప్పటి వరకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. మాకొక రైలు కావాలంటూ అయ్యప్పలు…
గజపతినగరం, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన ఆ యువకుడి జీవితం పట్టాలపై అర్ధాంతరంగా ముగిసిపోయింది. చెవులకు పెట్టుకున్న ఎయిర్‌పాడ్స్ శబ్దం.. మృత్యువు రూపంలో దూసుకొస్తున్న రైలు కూతను విననివ్వలేదు. రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్‌సీ కృష్ణారావు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన శీరంరెడ్డి సత్యం, రామకృష్ణమ్మ దంపతుల కుమారుడు పవన్‌కల్యాణ్(21) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.…
కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని కైరోకు దక్షిణంగా ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో రైలు కండక్టర్ కూడా ఉన్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
గిజా ప్రావిన్స్‌లోని అల్-అయ్యత్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కైరోకు సుమారు 52 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫయ్యూమ్ ప్రావిన్స్ వైపు వెళ్తున్న రైలు, దక్షిణ ప్రావిన్స్ అస్వాన్‌కు వెళ్తున్న మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఒకే ట్రాక్‌పై ఒకే దిశలో వెళ్తున్న ఈ రైళ్లలో ముందున్న రైలు నిలిచిపోయి ఉండటంతో వెనుక నుంచి వచ్చిన రైలు చివరి బోగీని బలంగా ఢీకొట్టినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
Train collision | ఈజిప్టులోని(Egypt) గిజా నగరం సమీపంలో ఘోర రైలు ప్రమాదం(Train collision) చోటు చేసుకుంది. గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. అల్ అయ్యత్ జిల్లా నుంచి ఫయూమ్ వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు.. కైరో నుంచి అస్వాన్ వెళ్తున్న మరో రైలును వెనక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగుడరు మృతి(Seven killed) చెందారు. మరో 100 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పి కాలువలోకి జారిపడ్డాయని దేశ రైల్వే అథారిటీ తెలిపింది. అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ప్రమాద ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇదే జిల్లాలో గతేడాది రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకోపైలట్, ఆయన అసిస్టెంట్‌కు గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘోర రైలు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆదివారం ఈజిప్ట్‌లో డిమాండ్లు వెల్లువెత్తాయి.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.