We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
తెలంగాణ రెరా నిబంధనలు ఉల్లంఘించిన 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యలు తీసుకుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, హామీలు నెరవేర్చకపోవడం వంటి కారణాలపై కొనుగోలుదారులకు వడ్డీతో సహా సొమ్ము వాపసు చేయాలని ఆదేశించింది.
హైదరాబాద్, వెలుగు: నిబంధనలు ఉల్లంఘించిన 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చర్యలు తీసుకుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, హామీలు నెరవేర్చకపోవడం, నమోదు లేకుండా బుకింగ్‌లు చేపట్టడం వంటి కారణాలపై కొనుగోలుదారులకు వడ్డీతో సహా సొమ్ము వాపసు చేయాలని ఆదేశించింది.
సనాలి ఐటీ పార్క్స్ సంస్థ రెరా చట్టం 2016లోని సెక్షన్లు 3, 4 ఉల్లంఘించినందుకు రూ.25 లక్షల జరిమానా విధించింది. 30 రోజుల్లో చెల్లించాలని, మంచిరేవులలోని 'సనాలి ది ఎడ్జ్' ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు, బుకింగ్‌లు, విక్రయాలు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ నిర్మాణంలో జాప్యం చేసి, బుకింగ్ రద్దు చేసుకున్న కొనుగోలుదారుకు నగదు వాపసు ఇవ్వకపోవడంతో రూ.17 లక్షలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. త్రిపుర కన్స్ట్రక్షన్స్ డబ్బులు వసూలు చేసి నిర్మాణం ప్రారంభించకపోవడం, ఫ్లాట్ అప్పగించకపోవడంతో రూ.41.85 లక్షలు వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది. వాసవి…
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన సాధిక్ అనే రియల్టర్‌ను సీబీఐ అధికారులుగా నటిస్తూ కిడ్నాప్ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బాధితుడి వద్ద రూ. 26 లక్షలు వసూలు చేసి, మిగిలిన డబ్బు కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
హైదరాబాద్ లోని పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రెరా కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు జరిమానా విధించింది రెరా. సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రూ.25 లక్షలు జరిమానా విధించింది రెరా. 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మంచిరేవులలోని సనాలి ది ఎడ్జ్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ లేకుండానే విక్రయాలు చేపట్టారని ఆరోపణలు ఉన్న క్రమంలో ఈమేరకు జరిమానా విధించింది రెరా.
రిజిస్ట్రేషన్ వచ్చే వరకు ప్రకటనలు, బుకింగ్‌లు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది రేరా. అంతే కాకుండా.. శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థకు కొనుగోలుదారు చెల్లించిన రూ.17 లక్షలు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని.. త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.41.85 లక్షలు వడ్డీతో సహా రీఫండ్ చేయాలని ఆదేశించింది రెరా.
మదనపల్లె నేరవార్తలు: సీబీఐ అధికారుల పేరుతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మదనపల్లె ఒకటో పట్టణ సీఐ మోహన్ కుమార్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అగడ్తా వీధికి చెందిన సాధిక్‌ను ఈనెల 11న కర్ణాటకకు చెందిన కొందరు కిడ్నాప్ చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న సాధిక్.. తరచుగా అక్కడి కోర్టు విచారణకు హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే చిత్తూరుకు చెందిన రాజ శ్రీనివాసులు అలియాస్ ఆర్ శ్రీనివాసన్‌తో సాధిక్‌కు పరిచయం ఏర్పడింది. సాధిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా డబ్బు సంపాదించారని గుర్తించిన శ్రీనివాసన్.. ఎలాగైనా అతన్ని కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన వెంకటరమణకు సమాచారం ఇచ్చాడు. వెంకటరమణ కర్ణాటకకు చెందిన కొంతమందితో సాధిక్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు.
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు నిర్మాణ సంస్థలపై రెరా కొరడా ఝుళిపించింది. తప్పుదోవ పట్టించే ప్రచారం, రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో భారీ జరిమానా విధించింది. కొనుగోలుదారులకు వడ్డీతో సహా రిఫండ్ చేయాలని రేరా అథారిటీ సభ్యులు లక్ష్మీ నారాయణ జన్ను, కె. శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా రాంపల్లి దాయరలోని ‘గోల్డెన్ కౌంటీ’ విల్లా ప్రాజెక్టుపై 27 మంది యజమానులు, సొసైటీ సభ్యులు రెరాకు ఫిర్యాదు చేశారు. ‘ప్లాటెడ్ లేఅవుట్’కు మాత్రమే అనుమతులు తీసుకుని, లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీగా తప్పుదోవ పట్టించే ప్రచారం చేసినట్లు…
క్లబ్‌హౌస్, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేయకపోవడంతో సంస్థలకు రూ.20.05 లక్షల జరిమానా విధించింది. 90 రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని, 30 రోజుల్లో క్లబ్‌హౌస్, కామన్ ఏరియాలను అసోసియేషన్‌కు అప్పగించాలని ఆదేశించింది. ఫేజ్-1 విల్లాలకు ఓసీలు ఇప్పించాలని, కొనుగోలుదారులు మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.