We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి పిలుపు సందర్భంపై సాక్షి కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం లేకుండా తల్లి, చెల్లిని అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు.
MS Dhoni: ఆ కారణంతోనే ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై చెప్పాడు: సురేశ్ రైనా
Not analysed for framing
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని (MS Dhoni) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అదే జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ధోని ఆటకు గుడ్‌బై చెప్పడానికి గల కారణాన్ని అతడి మాజీ సహచరుడు సురేశ్ రైనా (Suresh Raina) వెల్లడించాడు. పదేపదే మోకాలి సమస్యలు తలెత్తడంతో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని జియో హాట్‌స్టార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రైనా అన్నాడు. గాయాల కారణంగా 2026 సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.
‘‘ఆఫ్-సీజన్లో మహీ భాయ్ రకరకాల స్పోర్ట్స్ ఆడుతుంటారు. కానీ ప్రస్తుతం ధోని మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. అతడి రెండు మోకాళ్లలోనూ వాపు ఉంది. అతడు చేసిన వికెట్ కీపింగ్, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య దృష్ట్యా సహజంగానే శరీరంపై ప్రభావం ఉంటుంది. తాను ఫిట్ అవుతానని భావించి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జిమ్‌లో చాలా కష్టపడి శ్రమించాడు. వాపు సమస్య తలెత్తిన తర్వాత తాను ఎప్పటికీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఉండకూడదని పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చాడు. ఇది కెప్టెన్‌గా అతడిలోని గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ధోని ఇంకా ఆడాలకున్నాడు. కానీ అతడి శరీరం ఇక ఆ భారాన్ని తట్టుకోలేని స్థితిలో ఉంది. సీఎస్కే, ఐపీఎల్…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ ప్లేయింగ్ కెరీర్‌కు ముగింపు పలికారు, 2027 సీజన్ నుంచి సీఎస్కే జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ప్లేయింగ్ కెరీర్‌కు ముగింపు పలికారు. 2027 సీజన్ నుంచి ఆయన సీఎస్కే జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. ఈ పరిణామంపై ధోనీ భార్య సాక్షి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “కొన్ని అద్భుతమైన కొత్త అధ్యాయాలు ప్రారంభం కావాలంటే, పాతవి ముగియక తప్పదు” అని ఆమె పేర్కొన్నారు.
“ఇన్నేళ్లుగా మహీని ఆదరించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా.. మీరు చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. కొత్త ఆరంభాలు, సాహసాలు, మధుర జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నాం. మహీ, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను” అని సాక్షి రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు పర్వత శ్రేణులను వీక్షిస్తున్న ధోనీ వీడియోకు ‘ఆల్డ్ లాంగ్ సైన్’ గీతాన్ని నేపథ్య సంగీతంగా జత చేయగా, అది వేగంగా వైరల్ అయింది.
Sakshi Dhoni | భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సాక్షి సింగ్ ధోనీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘కొన్ని అధ్యాయాలు ముగిస్తేనే అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతాయి’ అంటూ మహీకి ప్రత్యేకంగా సందేశం ఇచ్చారు.
సాక్షి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్టులో.. ‘కొన్ని అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభం కావాలంటే కొన్ని అధ్యాయాలు ముగియాల్సి ఉంటుంది. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించి, మద్దతుగా నిలిచి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ ప్రేమకు ఎంతో కృతజ్ఞతలు. కొత్త ప్రారంభాలు, కొత్త ప్రయాణాలు, మరెన్నో మధురమైన జ్ఞాపకాలకు స్వాగతం. నీ గురించి ఎంతో గర్వంగా ఉంది మహీ’ అంటూ రాసుకొచ్చారు.
ఐపీఎల్‌కు మహేంద్రసింగ్ ధోని వీడ్కోలు పలకడంపై ఆయన సతీమణి సాక్షి ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు చేశారు. ‘‘ఇనేళ్లు మహీని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. కొత్త ఆరంభాలకు.. సరికొత్త సాహసాలకు.. మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం. మహీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అంటూ పర్వతాల వైపు చూస్తూ పోజిచ్చిన ధోని ఫొటోను షేర్ చేశారు. ⇒వివరాలు
Sakshi on MS Dhoni IPL Retirement: ధోనీ రిటైర్మెంట్.. సాక్షి ఎమోషనల్ పోస్ట్
Not analysed for framing
MS Dhoni IPL Retirement | ఇంటర్నెట్‌డెస్క్: 19 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో సారథి, బ్యాటర్, వికెట్ కీపర్‌గా రాణించిన మహేంద్ర సింగ్ ధోని.. ఆటగాడిగా తన ఇన్నింగ్స్ ముగించడం అభిమానులకు నిరాశే. అదే సమయంలో సీఎస్కేకు మెంటార్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. ఈ సమయంలో ఆయన భార్య సాక్షి ధోని (Sakshi Dhoni) ఎమోషనల్ పోస్టు పెట్టారు. జీవితంలో అందమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే.. కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందేనంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
‘‘ఇనేళ్లు మహీ (MS Dhoni) ని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. కొత్త ఆరంభాలకు.. సరికొత్త సాహసాలకు.. మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం. మహీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అంటూ పర్వతాల వైపు చూస్తూ పోజిచ్చిన ధోని ఫొటోను షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. కోల్‌కతాలోని తాజ్ హోటల్ మొదలైన ధోని, సాక్షి ప్రయాణం.. తర్వాత స్నేహంగా మారింది. 2010లో దేహ్రాదూన్‌లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరిట వచ్చిన చిత్రంలో వీరి ప్రేమకథ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.